ఎన్టీఆర్ మనవడు పొలిటికల్ ఎంట్రీ..!!

 

తెలుగులో సినిమాల గురించి మాట్లాడినా, రాజకీయాల గురించి మాట్లాడినా ముందుగా ఎన్టీఆర్ గుర్తొస్తారు.. సినిమాలతో ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నారో, రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకి అంతే దగ్గరయ్యారు.. అందుకే తెలుగు గడ్డ ఎప్పటికీ ఆయనను మర్చిపోదు.. ఆయన అడుగుజాడల్లోనే ఆయన వారసులు అటు సినిమాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు.. సినిమాల్లో బాలకృష్ణ, తారక్ లాంటి వారు ఆయన వారసత్వాన్ని నిలబెడుతూ దూసుకెళ్తుండగా.. రాజకీయాల్లో పురంధేశ్వరి, బాలకృష్ణ, లోకేష్ లాంటి వారు రాణిస్తున్నారు.

 

 

ఇక త్వరలో మరో మనవడు, ఎన్టీఆర్ అడుగు జాడల్లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.. అతనే, పురంధేశ్వరి కుమారుడు హితేష్.. ప్రస్తుతం పురంధేశ్వరి బీజేపీ పార్టీలో ఉన్నారు.. దీంతో హితేష్ కూడా బీజేపీ లో చేరుతారనే భావన వ్యక్తమవుతోంది.. అయితే పురంధేశ్వరి మాత్రం, ఏ పార్టీలో చేరాలనే విషయం కుమారుడుకే వదిలేసినట్టు తెలుస్తోంది.. హితేష్ కు, సోదరుడు నారా లోకేష్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.. అదీగాక ప్రస్తుతం బీజేపీ కంటే టీడీపీలో చేరితేనే ఎక్కువ మైలేజీ వచ్చే అవకాశం ఉంది.. దీంతో హితేష్ టీడీపీలో చేరాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.. అంతా అనుకున్నట్టు జరిగితే, త్వరలోనే హితేష్ టీడీపీలో చేరి వచ్చే ఎన్నికల్లో బరిలోకి కూడా దిగుతాడట.. చూద్దాం మరి ఏం జరుగుతుందో.. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీకి కూతురు పురంధేశ్వరి దూరంగా ఉంటున్నారు.. మరి మనవడు హితేష్ దగ్గరవుతారేమో చూద్దాం.