ప్రగతిభవన్ ముట్టడి కేసులో కేసీఆర్ మనవడు అరెస్ట్ 

త్వరలో తెలంగాణాలో ఎంట్రెన్స్ పరీక్షలు కండక్ట్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో 37మంది ఎన్.ఎస్.యు.ఐ కార్యకర్తలు ప్రగతి భవన్ ను ముట్టడించిన సంగతి తెలిసిందే.

 

ప్రస్తుతం ఉన్న కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ వాయిదా వేయాల‌ని కోరుతూ ఈ ముట్టడి చేసారు. తాజాగా ఈ కేసులో కేసీఆర్ మనవడు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ముట్ట‌డిలో సీఎం కేసీఆర్ అన్న కుమార్తె రమ్యారావు కొడుకు రితేష్ రావు కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది. రితేష్ రావును పోలీసులు ఈ కేసులో ఏ5 గా చేర్చారు. దీంతో అతడిని కూడా అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా 14రోజుల రిమాండ్ విధించడంతో అంద‌ర్నీ చంచ‌ల్ గూడ జైలుకు త‌ర‌లించారు.

 

ఐతే ఈ అరెస్ట్ పై సీఎం కేసీఆర్ అన్న కూతురు, కాంగ్రెస్ పార్టీ నేత‌ ర‌మ్యారావు మండిప‌డ్డారు. ఎన్.ఎస్.యూ.ఐ కార్య‌క‌ర్త‌లు ఉద్యమం చేసింది ఆస్తుల కోస‌మో, క‌మిష‌న్ల కోస‌మో కాద‌ని.. కేవలం విద్యార్థుల ప్రాణాల‌ను కాపాడ‌లనే ఏకైక ఉద్దేశంతోనే వారు ఆందోళ‌న చేశార‌న్నారు.