ఆపిల్ ట్రక్కులు అడ్డుకోలేరా.. గాజులు పంపమంటారా: పాక్ తీవ్రవాదులు

 

 

మోడీ ప్రభుత్వం కాశ్మీర్ విషయంలో కీలకమైన ఆర్టికల్ 370 ని తొలగించిన తరువాత తీవ్ర ఆగ్రహంతో  ఉడికి పోతున్న పాక్, భారత్ సరిహద్దుల్లో ఉగ్రవాదులను సిద్ధంగా ఉంచినట్లు వార్తలు వచ్చాయి. ఐతే తాజాగా ఈ విషయమై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ కీలక వ్యాఖ్యలు  చేశారు. పాకిస్థాన్ భారత్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఒక కోడ్ భాష ఉపయోగిస్తోందని, తాము ఆ సంకేతాలను గుర్తించామని అయన తెలిపారు. ఆపిల్ ట్రక్కులు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎలా ముందుకెళుతున్నాయి? వాటిని మీరు అడ్డుకోలేకపోతున్నారా? లేకపోతే గాజులు పంపమంటారా? అంటూ పాకిస్థాన్ నుంచి కశ్మీర్ కు కోడ్ భాషతో కూడిన సంభాషణలు నడుస్తున్నాయని అయన వెల్లడించారు. భారత్ సరిహద్దు పొడవునా 20 కిమీ పరిధిలో పాకిస్థాన్ కు చెందిన సిగ్నల్ టవర్లు ఉన్నాయని, వాటిద్వారా కశ్మీర్ లోని తమ వారికి ఉగ్రవాదులు సందేశాలు పంపుతున్నారని, అలాగే ఆయుధాలు, ఇతర సరంజామా పంపాలని ఉగ్రవాదులు కోరుతున్నట్టు భావిస్తున్నామని అజిత్ డోవల్ వివరించారు.