పాత నోట్లు ఉన్నవారికి లాస్ట్ ఛాన్స్..!

నల్లధనానికి అడ్డుకట్ట వేయడంతో పాటు..ఆర్ధిక వ్యవస్థను ప్రక్షాళన చేయాలనే ఉద్దేశ్యంతో ప్రధాని నరేంద్రమోడీ పెద్దనోట్లను రద్దు చేశారు. ప్రజల దగ్గర ఉన్న పాత నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవడానికి 2017 మార్చి 31 వరకు గడువునిచ్చారు. ఆ తర్వాత ప్రజలు పాతనోట్లను కలిగి ఉండటం నేరమని..దీనిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రధాని తెలిపారు. పెద్దనోట్లు రద్దైన తర్వాతి రోజు నుంచే ప్రజలు తమ వద్ద ఉన్న పాతనోట్లను బ్యాంకుల్లో మార్చుకున్నారు. అయితే గడువు తేది దాటినా ఇంకా చాలా మంది దగ్గర పాతనోట్లు మిగిలిపోయాయి. అంతేందుకు సాక్షాత్తూ శ్రీవారి హుండీలోనే వందల కోట్ల విలువ చేసే పాతనోట్లు ఉన్నాయి. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్ధితి నెలకొంది. అలాంటి వారికి బంపరాఫర్ ఇచ్చింది కేంద్రప్రభుత్వం. రద్దయిన పెద్దనోట్లను డిపాజిట్ చేసేందుకు అవకాశమిచ్చింది..బ్యాంకులు, పోస్టాఫిసులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల్లో, రిజర్వ్ బ్యాంక్ కార్యాలయాల్లో నోట్లను మార్పిడి చేసుకోవచ్చని..ఇందుకు 30 రోజుల వ్యవధిని ఇచ్చింది..ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.