భారత్ చెబితే నార్త్ కొరియా వింటుంది..


ఒకపక్క భారత్-చైనా మధ్య సరిహద్దల వార్ జరుగుతుంటే.. మరోపక్క ఉత్తర కొరియా-అమెరికా మధ్య మాటల యుద్దం జరుగుతుంది. ఉత్తర కొరియా క్షిపణలు ప్రయోగిస్తూ అమెరికాను కవ్విస్తుంటే.. అమెరికా కూడా తామేమి తక్కువ తినలేదు అన్నట్టు మేం కూడా ప్రయోగిస్తాం అని వార్నింగ్ లు ఇస్తుంది. మరోవైపు ఈ రెండు దేశాల వార్ మధ్య స్పందించిన చైనా..ఉత్తర కొరియాకు ఇన్ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా విషయంలో ఆవేశంతో వ్యవహరించి అనర్థం కొని తెచ్చుకుంటే జరగబోయే పరిణామాలను ఒంటరిగానే ఎదుర్కోవాల్సి ఉంటుందని, తాము సాయంగా రాబోమని తెలిపింది. మరోవైపు దీనిపై అమెరికా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఉత్తర కొరియా అణు సంక్షోభ సమస్యను భారత్‌ తీర్చగలదని.. మిగితా దేశాలతో పోలిస్తే భారత్‌ది చాలా బలమైన గొంతు అని, సమస్యను చాలా చక్కగా వివరించగల సొత్తు భారత్‌ సొంతమని అమెరికాకు చెందిన ఉన్నత శ్రేణి కమాండర్‌ అడ్మిరల్‌ హ్యారీ హ్యారీస్‌ అన్నారు. ఈ విషయంలో భారత్‌ ఎలాంటి పాత్ర పోషించాలనుకుంటుందో ఆ దేశమే నిర్ణయించుకోవాలని చెప్పారు.