అది నల్లధనం కాదా మోడీజీ..!

 

అది నల్లధనం కాదా మోడీజీ..!భూమి సూర్యుడు చుట్టూ తిరిగినట్టు, మనిషి డబ్బు చుట్టూ తిరుగుతుంటాడు.. అందుకేనేమో మోడీ మనల్ని డబ్బుతో కొట్టారు.. 2014 ఎన్నికల సమయంలో..' స్విస్ బ్యాంకుల్లో వేల కోట్ల భారతీయుల నల్లడబ్బు మూలుగుతుంది.. దాన్ని రప్పించి ప్రతి భారతీయుడి ఖాతాలో 15 లక్షలు వేస్తాం' అన్నారు.. 2016 లో నోట్లరద్దు చేసి '50 రోజులు క్యూలో నిల్చొని దేశభక్తిని చాటుకోండి.. దేశంలో నల్లధనమే లేకుండా పోతుంది అన్నారు'.. తీరా చుస్తే, గత ఏడాది భారత్ నుంచి డిపాజిట్లు 50 శాతం పెరిగాయి.. దీంతో స్విస్ లో భారతీయుల డిపాజిట్లు రూ 7000 కోట్లకు చేరాయి..

ఇదేంటి మోడీజీ నల్లధనం తగ్గాల్సిందిపోయి ఇంకా పెరిగిందని ప్రజలు అడుగుతుంటే.. ఆ డబ్బు మొత్తం నల్ల ధనమేనని ఎలా భావిస్తామంటూ ఆర్థికశాఖ ఇన్ చార్జిగా ఉన్న కేంద్ర మంత్రి పియూష్ గోయల్ అద్భుతమైన సమాధానం చెప్పారు.. 2014 లో మీరన్న నల్ల డబ్బు ఇప్పుడు తెల్లడబ్బుగా ఎలా మారిందంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.. ఇదే విషయంపై రాహుల్ గాంధీ స్పందించారు.. '2014 లో, స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్ల డబ్బు తీసుకొచ్చి ప్రతి భారతీయుడి అకౌంట్లో 15 వేస్తాం అన్నారు.. ఇప్పుడేమో స్విస్ బ్యాంకుల్లో 50 శాతం పెరిగిన భారతీయుల డబ్బు నల్లధనం కాదంటున్నారు' అంటూ రాహుల్ మండిపడ్డారు.