నితీశ్ కు బెదిరింపు... త్వరలోనే చంపేస్తా

 

బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ను త్వరలోనే హత్య చేస్తానంటూ బెదిరింపులు వచ్చాయి. ఏదో ఫోన్ లో కాదు.. ఏకంగా ఓ సెల్ఫీ వీడియోనే తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వివరాల ప్రకారం... పట్నా జిల్లాలోని ఫతుహా అనే ప్రాంతానికి చెందిన ప్రమోద్‌ కుమార్‌ అలియాస్‌ పోయామా తన బాడీగార్డ్‌లతో కలిసి నితీశ్‌ను త్వరలోనే చంపేస్తానంటూ ఓ వీడియో తీసి దానిని సోషల్‌ మీడియాలో పెట్టాడు. అంతే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి పోలీసుల వరకూ చేరింది. ముఖ్యమంత్రి నితీశ్‌ కాన్వాయ్‌పై దాడి జరిగిన కొద్ది సేపటికే ఈ వీడియో బయటకు రావడంతో పోలీసులు వెంటనే స్పందించారు. అతడిని అరెస్టు చేశారు.