పవన్‌పై పోటీకి నిమ్మగడ్డ సై..?

 

రాజకీయ నాయకుడు ఎన్నికలు ఉన్నప్పుడే ప్రచారం చేస్తే సరిపోదు.. ఎన్నికలు లేకపోయినా ఆరోజు ఈరోజని తేడాలేకుండా ప్రతిరోజూ ప్రచారం చేసుకోవాలి.. అప్పుడే నాయకుడు అనేవాడు ప్రజల్లో ఉంటాడు.. ఈ ఫార్ములాని ఇంచుమించు అన్ని పార్టీలు ఫాలో అవుతున్నాయి.. అందుకే ప్రతి పార్టీ సొంతంగానో లేక అనుకూలమైన వ్యక్తులతోనో.. న్యూస్ పేపర్, ఛానల్ నడిపిస్తున్నాయి.. ఎప్పటినుండో ఉన్న పార్టీల దగ్గరనుండి ఈ మధ్య వచ్చిన పార్టీల వరకు అన్నింటికీ మీడియా విలువ బాగా తెలుసు.. జనసేనకి కూడా మీడియా విలువ తెలిసినట్టుంది.. ఆ మధ్య కొన్ని ఛానెల్స్ మీద విమర్శలు చేసిన పవన్, పార్టీ తరుపున తనకంటూ ఓ ఛానల్ ఉండాలని అనుకుంటున్నారట.. దానిలో భాగంగానే కొత్త ఛానల్ తీసుకోవాలి అనుకున్నారట.. 

తరువాత కొత్త ఛానల్ కంటే ఆల్రెడీ కొంత పేరున్న పాత ఛానల్ కొనడం బెటర్ అని డిసైడ్ అయ్యారట.. ఓ ఎన్నారై ఆర్థిక సాయంతో 10 టీవీ ఛానల్ కొనాలని సంప్రదింపులు కూడా జరిపారట.. ఇక 10 టీవీ జనసేన టీవీ అని ఆనందపడే లోపు, అనూహ్యంగా నిమ్మగడ్డ ప్రసాద్ తెరమీదకు వచ్చారట.. భారీమొత్తానికి ఛానల్ కొంటా అనడంతో ఛానల్ యాజమాన్యం ఆలోచనలో పడినట్టు తెలుస్తుంది.. దీన్ని బట్టి చూస్తుంటే, ఒక ఛానల్ కోసం 'పవన్ పై పోటీకి నిమ్మగడ్డ ప్రసాద్ సై' అన్నట్టు తెలుస్తుంది.. అయితే ఈ విషయంపై కొందరి వాదన వేరేలా ఉంది.. వైసీపీ, జనసేన కుమ్మక్కయ్యాయి.. అందుకే వైసీపీ సానుభాతిపరుడు నిమ్మగడ్డ, పవన్ కోసం ఛానెల్ కొంటున్నాడు అంటున్నారు.. వీటిల్లో ఏది నిజమో కాలమే నిర్ణయించాలి.