బరువేక్కించే రాత్రి షిఫ్టులు

 

 

 

ఈ మధ్య కాలంలో రాత్రి షిఫ్టుల్లో పని చేసే వారి సంఖ్య చాలా పెరిగింది అలా రాత్రి షిఫ్టుల్లో పని చేసే వారిలో చాలా మంది వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు గుర్తించారు నిపుణులు. అయితే ఆ ఆరోగ్య సమస్యలన్నీటికి మూలం వారు బరువెక్కటమే అని కూడా తేలిందట.

 

దానికి కారణం రాత్రి పూట అధికంగా ఆహారం తీసుకోవడం, పగలంతా నిద్రపోవటం, సరైన పోషకాహారం తీసుకోకపోవడం ఇవన్ని వారి శరీర బరువుపై ప్రభావాన్ని చూపిస్తున్నట్టు ఓ అధ్యయనంలో తేలింది. కాబట్టి రాత్రి షిఫ్టులు చేసే వారు నిద్రాహారాల విషయంలో ఓ పద్దతిని పాటించడం చాలా అవసరమని సూచిస్తున్నారు పరిశోధకులు..