మమ్మలి ఇబ్బంది పెట్టొద్దు... NHRCపై దిశ పేరెంట్స్ ఆగ్రహం

దిశ హత్యాచార ఘటన, నిందితుల ఎన్ కౌంటర్ పై NHRC బృందం విచారణ జరుపుతోంది. విచారణలో భాగంగా దిశ పేరెంట్స్ ను, సోదరిని NHRC ప్రశ్నించింది. దిశ ఫోన్ కాల్... పోలీసుల రియాక్షన్... ఇలా ఆరోజు అసలేం జరిగిందో తెలుసుకునేందుకు దిశ కుటుంబ సభ్యుల స్టేట్ మెంట్స్ ను రికార్డు చేసింది. అయితే, NHRCపై దిశ పేరెంట్స్ మండిపడుతున్నారు. దిశపై అత్యాచారం చేసి దారుణంగా చంపేసినప్పుడు ఈ మానవ హక్కుల కమిషన్ ఎక్కడికిపోయిందని నిలదీశారు. అప్పుడు మానవ హక్కులు కనిపించలేదా? కేవలం ఎన్ కౌంటర్ తర్వాతే గుర్తుకొచ్చాయా? అంటూ NHRC బృందాన్ని దిశ పేరెంట్స్ ప్రశ్నించారు.

అసలు, NHRC విచారణకు హాజరయ్యేందుకు దిశ కుటుంబ సభ్యులు మొదట నిరాకరించారు. దిశ... దశ దిన కర్మ రోజున విచారణ పేరుతో పోలీసులు వేధిస్తున్నారని మండిపడ్డారు. NHRC విచారణకు హాజరయ్యేది లేదని దిశ కుటుంబ సభ్యులు తేల్చిచెప్పడంతో స్థానికులు కూడా మద్దతుగా నిలిచారు. అయితే, దిశ పేరెంట్స్ ను ఒప్పించిన పోలీసులు... ఎస్కార్ట్ మధ్య NHRC ముందు హాజరుపరిచారు. అయితే, ఎన్ కౌంటర్ గురించి తమను ఏమీ అడగలేదని... ఆరోజు ఘటన ఎలా జరిగిందో మాత్రమే అడిగారని దిశ తండ్రి తెలిపారు. అయితే, తన కుమార్తె కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ కు వెళ్తే నిర్లక్ష్యంగా వ్యవహరించారని NHRC దృష్టికి తీసుకెళ్లామన్నారు.