గెలాక్సీ 6 వచ్చేస్తోందోచ్

 

యాపిల్ సంస్థతో పోటీపడగల సత్తా వున్న శామ్ సంగ్ ఎలక్ట్రానిక్స్ సంస్థ గెలాక్సీ ఎస్ 6, గెలాక్సీ ఎస్ 6 ఎడ్జ్ పేర్లతో కొత్త స్మార్ట్ ఫోన్లలను ఆవిష్కరించింది. యాపిల్ సంస్థ విక్రయిస్తున్న ఐఫోన్ 6, ఐఫోన్ 6 ఫ్లస్‌లకు పోటీగా భావిస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలను ఏప్రిల్ 10 నుండి భారత్‌తో పాటు ఇతర అంతర్జాతీయ మార్కెట్‌లలో ఒకేసారి చేపట్టనుంది. గెలాక్సీ ఆరోతరం ఫోన్లుగా భావించే ఈ ఫోన్లను శామ్‌సంగ్ సంస్థ సీఈఓ జేకే షిన్ ఆవిష్కరించారు. ఈ ఫోన్లకు 5.1 అంగుళాల క్వాడ్ హెచ్ డీ సూపర్ ఆమాల్డ్త్ టచ్ స్ర్కీన్‌తో పోటు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 14 నానో మీటరు మొబైల్ ప్రాసెసర్లను అమర్చినట్టు తెలిపారు. ఈ ఫోన్ తయారీకి ఉపయోగించిన లోహం ఇతర లోహాల కంటే 50 శాతం కఠినంగా ఉంటుందని, వంగే ప్రసక్తే లేదన్నారు.

ప్రత్యేకతలు

ఆండ్రాయిడ్ 5.0.2 లాలీపాప్ ఓఎస్, 1.5 గిగాహెర్జ్ కోర్టెక్స్ ఏ54, 2.1 గిగాహెర్జ్ కోర్టెక్స్ ఏ57 ప్రాసెసర్లు, 3 జీబీ ర్యామ్, 32-64-128 జీబీ ఇన్నర్ మెమొరీ, 5-16 ఎంపీ కెమరాలు, 2550 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.

శామ్ సంగ్ గేర్ వీఆర్ హెడ్ సెట్

గెలాక్సీ ఎస్ 6, ఎస్ 6 ఎడ్జ్ లకు అనుసంధానించేందుకు వీలుగా సెకండ్ జనరేషన్ హెడ్ సెట్ గేర్ వీఆర్ ను కూడా ప్రదర్శించింది.