నవాజ్ షరీఫ్ కు పదవిగండం తప్పినట్టే..!


పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మనీ ల్యాండరింగ్, అక్రమ పద్దతిలో ఆస్తులు కట్టబెట్టారన్న ఆరోపణలు చేస్తూ ఇమ్మాన్ ఖాన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై విచారించిన పాకిస్థాన్ సుప్రీంకోర్టు.. ప్రధాని నవాజ్ షరీప్ ను పదవీచ్యుతుడిని చేసేంత బలమైన ఆధారాలు లేవని ప్రకటించింది. దీంతో పదవీ గండం నుంచి నవాస్ షరీఫ్ తప్పించుకున్నారు. అంతేకాదు ప్రధాని కుటుంబంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు ఒక సంయుక్త దర్యాప్తు బృందాన్ని (జిట్‌) ఏర్పాటు చేయాలని...ఇందులో పాక్ కు చెందిన నిఘా లేదా దర్యాప్తు సంస్థలకు చెందిన ఐదుగురు ప్రతినిధులు ఉండాలని సూచించింది. రెండు నెలల్లో ఈ బృందం దర్యాప్తు పూర్తి చేసి, న్యాయస్థానానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.