నేడు కాంగ్రెస్ లోకి సిద్ధూ...

Publish Date:Jan 11, 2017

 

మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ బీజేపీ నుండి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. బీజేపీ పార్టీ నుండి బయటకు వచ్చిన సిద్దూ.. ఆ తరువాత ఆప్ పార్టీలో చేరుతారా.. కాంగ్రెస్ పార్టీలో చేరుతారా అన్న సందేహాలు ఏర్పడ్డాయి. అయితే ఆ తరువాత సిద్దూ కొత్త పేరు పెడుతున్నట్టు ప్రకటించారు. అయితే ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయదని.. అది పార్టీ కాదు ఫ్రంట్‌ మాత్రమే అన్నారు. ఇక అటు తిరిగి.. ఇటు తిరిగి అఖరికి  కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు. ముందుగా సిద్దూ భార్య కాంగ్రెస్ పార్టీలో చేరగా.. ఇప్పుడు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈరోజు సిద్ధూ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు భారీ బహిరంగ సభను కాంగ్రెస్ ఏర్పాటు చేసింది.

 

కాగా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం 40 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ఇప్పటికే రాహుల్ ఫైనలైజ్ చేయగా, ఇంతవరకూ 77 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. మొత్తం 117 నియోజకవర్గాలున్న రాష్ట్రంలో మరో 40 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు కావాల్సి వుంది.

By
en-us Politics News -