టాటా ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖరన్

టాటాసన్స్ కొత్త ఛైర్మన్‌గా ఎన్.చంద్రశేఖరన్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. బాంబే హౌస్‌లోని టాటాసన్స్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ఆయనకు ఉన్నతాధికారులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. అనంతరం ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు..ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన నాయకత్వం వహించడమే కాని మరొకరిని అనుసరించే అలవాటు టాటాల చరిత్రలో లేదని అన్నారు. ఈ బాధ్యతలను స్వీకరించడం సంస్థ అభివృద్ధిలో భాగస్వామి కావడానికి తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానన్నారు..పారిశ్రామిక రంగంలోనే ముందుకు దూసుకుపోయే విధంగా తన పాలనను కొనసాగిస్తానని చంద్రశేఖరన్‌ అన్నారు..అందుకు అందరి సహకారం కావాలని సమిష్టిగా కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చని ఆయన అన్నారు.