మహాకూటమికి భయపడని మోడీ..!!

 

2014 ఎన్నికలు సమయంలో మోడీ హవా బాగా కొనసాగింది.. ఎక్కడికెళ్లినా మోడీనే పీఎం అని బలంగా వినిపించింది.. అనుకున్నట్టే ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి, మోడీ పీఎం అయ్యారు.. మోడీ దెబ్బకి కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రతిపక్ష పార్టీ హోదా కూడా దక్కించుకోలేకపోయింది.. మోడీ హవాలో ఇక కాంగ్రెస్ కోలుకోవడం కష్టమే అనుకున్నారంతా.. దానికి తగ్గట్టే మొదటి మూడేళ్లు మోడీ దూసుకెళ్లారు.. కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా.. నాలుగో ఏడాది మోడీ మీద ప్రజల్లో కొంత వ్యతిరేకత, విమర్శలు, కొన్ని మిత్రపక్షాలు దూరం.. 

ఇలా ఒకదాని తరువాత ఒకటి మోడీని చుట్టుముట్టాయి.. దీంతో కాంగ్రెస్ కి తిరిగి ప్రాణం లేచి వచ్చినట్టు అయింది.. కాంగ్రెస్ తాము అధికారంలోకి రావడం ముఖ్యం కాదు, మోడీని గద్దె దించడమే ప్రధాన లక్ష్యం అంటూ పావులు కదపడం మొదలు పెట్టింది.. ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా ఏ పార్టీతోనైనా పొత్తుకు సిద్ధమైంది.. అనుకున్నట్టే కొన్ని ఉపఎన్నికల్లో బీజేపీకి షాక్ ఇచ్చింది.. కర్ణాటకలో జేడీఎస్ కి మద్దతిచ్చి బీజేపీకి అక్కడ అధికారం దక్కకుండా చేసింది.. ఇదే ఫార్ములాతో వచ్చే ఎన్నికల్లో మోడీని ఓడించాలని కాంగ్రెస్ భావిస్తుంది.. 

మోడీ వ్యతిరేక శక్తులన్నింటినీ ఏకం చేసి, మహాకూటమిగా ఏర్పడి, వచ్చే ఎన్నికల్లో మోడీని దెబ్బ తీయాలని భావిస్తుంది.. ఈ మహాకూటమితో మోడీ భయపడతారు.. ఆచితూచి అడుగులు వేస్తారు అనుకున్నారు.. కానీ మోడీలో మహాకూటమి భయం ఏ మాత్రం కనిపించట్లేదు.. మహాకూటమిని చాలా సింపుల్ గా తీసేస్తున్నారు.

తాజాగా మోడీ మహాకూటమి గురించి స్పందించారు.. 'మహాకూటమి విషయంలో తనకు ఎలాంటి ఆందోళన లేదని.. అసలు కూటమి సక్సెస్ అయ్యే అవకాశమే లేదని తేల్చేశారు.. పొత్తులు కుదుర్చుకోవాలంటే ప్రధాన పార్టీ ఒకటి ఉండాలి కానీ మహాకూటమిలో ప్రధాన పార్టీ అన్నదే లేదని తేల్చారు..ప్రతిపక్షాలను కలిపి ఉంచుతున్నది మోడీపై ద్వేషం ఒక్కటే.. కాంగ్రెస్ తన మనుగడ కోసం పోరాటం చేస్తోంది.. ప్రతిపక్షాల్లోని అందరి దృష్టి అధికారం మీదనే.. వ్యక్తిగత మనుగడ, ప్రధాని పదవి తప్ప వాళ్లకు మరొకటి అక్కర్లేదు.. 

ప్రధాని పదవిని చేపట్టటానికి రాహుల్ సిద్ధంగా ఉన్నానని చెప్పారు.. తృణమూల్ అధినేత్రి మమతా కూడా ప్రధాని పదవిపై కన్నేశారు.. కానీ, ఆమెకు వామపక్షాలకు పడదు.. ప్రధాని పదవి తమ అధినేత తప్ప అర్హుడు లేడని సమాజ్ వాదీ అంటుంది.. కాంగ్రెస్ అహంకారాన్ని ప్రజలు గత ఎన్నికల్లో తిరస్కరించారు.. పొత్తుల కోసం ఎక్కే గడప దిగే గడప అన్నట్లు ఉంది ఆ పార్టీ పరిస్థితి.. ఇప్పుడా పార్టీ ప్రాంతీయ పార్టీలా మారింది' అని మోడీ అన్నారు.. వ్యతిరేకత, విమర్శలు, మహాకూటమి ఇవేమి మోడీని బయపెట్టట్లేదు.. చూద్దాం మరి వచ్చే ఎన్నికల్లో మోడీ అనుకున్నట్టు జరుగుతుందో లేదో.