మోడీజీ బ్యాండ్ బాజా అవుతుందిగా...

 

దేశంలో అవినీతి అనేదే లేకుండా చేస్తాం...మన దేశాన్ని చూసి గర్వపడేలా చేస్తాం అని ప్రగల్పాలు పలికిన మోడీ పైన ఉన్న నమ్మకం 2జీ స్కాం తీర్పుతో పోయినంత పనైంది. ఇప్పటికే ఆయన ప్రధాని అయిన తరువాత తీసుకున్న పలు నిర్ణయాల వల్ల ఉపయోగం ఎంత ఉన్నా.. చాలా మందిలో వ్యతిరేక భావం అయితే నెలకొంది. ఇప్పుడు 2జీ స్కాం తీర్పుతో ఆయనకు పూర్తి వ్యతిరేకంగా మారే పరిస్థితి ఏర్పడింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోడీ ప్రచారం మొత్తం 2జీ స్కాం.. బొగ్గు కుంభకోణం మీదనే సాగింది. దీంతో మోడీ వస్తే దేశం ఇంకెంత బావుంటుందో అని అందరూ ఆయనకు పట్టం గట్టారు. కానీ అందరిలాగానే తాను కూడా అని..ఆయనేం మినహాయింపు కాదని ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు గమనిస్తే ఇట్టే అర్థమవుతుంది.

 

ఇక 2జీ స్కాం పై వచ్చిన తీర్పు చూసి కొంత మంది సంతోషిస్తున్నా...చాలా మంది మాత్రం మోడీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే ఓ ఆట ఆడుకుంటున్నారు. మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు.. ఆయన తీరు చూసి నెటిజన్లు కామెంట్లు చేసుకుంటున్నారు. ఆ కామెంట్లలో కొన్ని కామెంట్లు చూద్దాం..

 

* మోడీ జీ నోట్ల రద్దు అనంతరం విదేశాలకు తరలివెళ్లిన బ్లాక్ మనీని వెనక్కి తీసుకురాలేదు. 2జీ స్కాం నిందితులకు శిక్ష పడలేదు, గంగ ఇప్పటికి పరిశుభ్రం కాలేదు, వాద్రా మీద ఆరోపణలు నిరూపితం కాలేదు.

 

* ఇక విదేశాలకు వెళ్లిన మాల్యా కూడా ఇండియా రావడానికి ఏం భయపడడు. 1.76 లక్షల కోట్లు తిన్న వారినే వదిలేశారు. మాల్యా కేవలం తొమ్మిది వేల కోట్లేగా తిన్నది.. 2జీ తీర్పు విన్నాక విజయ్ మాల్యా ఇండియాకు తిరిగి రావటానికి  నిర్ణయించుకున్నారు.

 

*  2జీ స్కాం: క్లీన్ చిట్ బొగ్గు స్కాం:  కొందరు నిందితులకు మూడేళ్లు జైలు ఇది.. అవినీతిపై బీజేపీ బలంగా యుద్ధం చేయటమంటే..

 

* జెస్సికా లాల్ను ఎవరూ చంపలేదు.. కృష్ణ జింకలనూ ఎవరూ చంపలేదు. ఆరుషిని కూడా ఎవరూ హత్య చేయలేదు. ఇప్పుడు రూ.1.76లక్షల కోట్లను ఎవరూ దొంగలించలేదు. శభాష్ ఇండియా!!

 

* స్కాములను బయటపెట్టటం వినోద్ రాయ్ (కాగ్) పని కాదు. మోడీని అధికారంలోకి తేవటమే ఆయన డ్యూటీ. చాలా స్మూత్ గా పని పూర్తి చేశారు. అభినందనలు.

 

*  జడ్జి...మిమ్మల్ని ఎందుకు విడుదల చేయాలో ఒక్క కారణం చెబుతారా?

దోషులు..సర్.. ప్రపంచమంతా 4జీ అంటోంది. మీరింకా 2జీ చుట్టూ తిరుగుతున్నారు.

జడ్జి.. గుడ్.. బావుంది. విడుదల చేసేశాను పొండి

 

* డీఎంకే అంటే.. ద్రవిడ మోదీ కళగం

 

మరి ఇప్పటికైనా మోడీకి అర్ధమవుతుందో లేదో.. ఇలాంటి తీర్పులిస్తే రియాక్షన్ ఎలా ఉంటుందో. ప్రజలు ఏం చెప్పినా వింటారు... అధికారంలో ఉన్నాం కదా... ఏం చేసినా ఊరుకుంటారు అని అనుకుంటున్నారేమో.. తేడా వస్తే నమ్మిన పార్టీనే పాతాళానికి తొక్కేయడానికి కూడా సిద్దపడతారని తెలీదు. బీజేపీకి కూడా త్వరలో అదే గతి పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మోడీ జీ ఇప్పటికైనా కాస్త కళ్లు తెరవండి సార్...