నేనొక వైపు .. మీరొక వైపు

 

లోక్‌సభలో ఓవైపు అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుండగా మరోవైపు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై వరుస ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు.'గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాల నుంచి ఇప్పటికైనా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే ఎన్డీయేలో చేరాం.న్యాయం కోసం వేడుకున్నాం, వేచిచూశాం, వారి చుట్టూ తిరిగాం' అని ఆ ట్వీట్‌లో నారా లోకేష్ పేర్కొన్నారు. 'ఇందుకు మనకు ఏం జరిగింది? ఆచరణలో లేని వాగ్దానాలు, హామీలు తప్ప అంతకు మించి ఏం జరగలేదు.ఏపీని తల్లిదండ్రులు లేని అనాథగా చేశారు.ఇక మనం చేయాల్సింది ఒక్కటే.ప్రతి తెలుగువాడు ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరగాలని గళం విప్పాలి. న్యాయపోరాటంలో ప్రతి ఒక్కరూ కలిసి రావాలి' అని ఆయన అన్నారు.