ఆర్కేతో చేయి కలిపిన నారా లోకేష్!!

 

ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఓ ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ఒకరిపై ఒకరు పోటీ చేసిన వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి, టీడీపీ నేత నారా లోకేష్ ఎదురుపడి ఒకరినొకరు పలకరించుకున్నారు.

అసెంబ్లీ లాబీలోని వైఎస్‌ఆర్‌ఎల్పీ కార్యాలయం వద్ద ఆర్కే కార్యకర్తలతో మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో శాసనసమండలి సమావేశానికి వెళుతున్న లోకేష్.. ఆర్కేను చూసి పలకరించారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు షేక్ హ్యాండిచ్చి కంగ్రాట్స్ చెప్పారు. ఇందుకు స్పందించిన ఆర్కే.. ధన్యవాదాలు తెలిపారు. కాగా ఈ ప్రత్యర్థులు ఇద్దరూ ఇలా పలకరించుకోవడం ఇదే మొదటసారి కావడం విశేషమని చెప్పుకోవచ్చు. ఎన్నికల ప్రచారంలో గానీ, అంతకు మందు కానీ ఇద్దరు నేతలు ఎదురుపడ్డ సందర్భం లేదు.