లోకేశ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు...

 

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికైన విషయం తెలిసిందే. ఈయన ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 30న ఉదయం 9.45 గంటలకు ఎమ్మెల్సీగా ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. శాసనమండలి ఛైర్మన్‌ చక్రపాణి తన కార్యాలయంలో నారా లోకేశ్‌తో ప్రమాణస్వీకారం చేయించనున్నారు.