నారా కాదు..సారా చంద్రబాబు నాయుడు

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా. లోటస్‌పాండ్‌లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించడానికే టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు జరుపుతున్నారన్నారు. మద్యాన్ని హోమ్‌ డెలీవరి చేయిస్తూ ఎన్నో కుటుంబాల్లో నిప్పులు పోస్తున్నారంటూ మండిపడ్డారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు..సారా చంద్రబాబు నాయుడిగా పేరు మార్చుకోవాలని ఆమె వ్యాఖ్యానించారు. మహిళల సమస్యలను సీఎం పట్టించుకోవడం లేదంటూ ఎద్దెవా చేశారు.