నంద్యాల నాకు ఇవ్వండి..

 

నంద్యాల ఉపఎన్నిక ప్రచారంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జోరుగానే పాల్గొంటున్నారు. ప్రతిపక్ష పార్టీపై ఒక రేంజ్ లో విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇక ఈరోజు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. ఈ ఎన్నికలో శిల్పా మోహన్ రెడ్డికి ఓటేసి గెలిపించాలని.. ఆపై అసలు సిసలైన అభివృద్ధి ఎలా ఉంటుందో తాను చూపిస్తానని వైకాపా అధినేత వైఎస్ జగన్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఎన్నికలు వచ్చాయి కాబట్టే చంద్రబాబుకు నంద్యాల గుర్తుకు వచ్చిందని, ఇవే నిధులు అంతకుముందు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. పులివెందులతో సమానంగా నంద్యాలను చూసుకుంటానని, ఇక్కడి ప్రజలు తనకు బంధువర్గమని అన్నారు. చంద్రబాబు గతంలో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ అమలు చేయలేదని విమర్శించారు.