బిల్డింగ్ లు కూల్చేయడం, రోడ్లు తవ్వడం అభివృద్ధి కాదు

నంద్యాల ఉప ఎన్నిక‌ల ప్ర‌చారం హోరాహోరీగా సాగుతోంది. ప్ర‌చారంలో ఐదో రోజు వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ నంద్యాల‌లో ప‌ట్ట‌ణంలో రోడ్ షో నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ బిల్డింగ్ లు కూల్చ‌డం, రోడ్డు త‌వ్వ‌డం అభివృద్ధి కాద‌ని..రైతులు, పేద‌ల ముఖాల్లో చిరున‌వ్వు చూడ‌ట‌మే నిజ‌మైన అభివృద్ధి అన్నారు. మిమ్మ‌ల్ని నేను ఒక్క‌టే కోరుకుంటున్నా..ధ‌ర్మానికి ఓటేయ్యండి..న్యాయాన్ని గెలిపించండి. మీ ఓటుతో నేను వెంట‌నే సీఎం కాక‌పోవ‌చ్చు కానీ ఏడాది త‌ర్వాత జ‌రగ‌బోయే సంగ్రామానికి నంద్యాల నాంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు డ‌బ్బు మూట‌ల‌తో మీ వ‌ద్ద‌కు వ‌స్తారు. దోచుకున్న అవినీతి సొమ్ముతో ఓటుకి ఎంతైనా ఇచ్చి కొనుగోలు చేస్తారు. ఆయ‌న‌లా నా ద‌గ్గ‌ర డ‌బ్బు, అధికారం, పోలీసులు లేరు. నాన్న గారు నాకిచ్చిన ఆస్తి పెద్ద కుటుంబ‌మే. మీ జ‌గ‌న్ అబ‌ద్ధం ఆడ‌డు..మాట మీద నిల‌బ‌డే విశ్వ‌స‌నీయ‌తే నా ఆస్తి.