నంద్యాల ఉప ఎన్నిక ప్రచారానికి ముగిసిన గడువు

గత కొద్ది రోజులుగా టీడీపీ, వైసీపీ నేతల పరస్పర విమర్శలు, ఆరోపణలు, మాటల తూటాలతో వేడెక్కిన నంద్యాల ఉప ఎన్నిక ప్రచారానికి ఈ సాయంత్రంతో గడువు ముగిసింది. ఎన్నిక ముగిసే వరకు టీవీల్లో, పత్రికల్లో పోలింగ్ సర్వే వంటివి వస్తే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. ఎల్లుండి పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని..ఆరోజు సాయంత్రం 6 గంటల సమయంలో లైనులో ఉన్న వారందరూ ఓట్లు వేయవచ్చని..ఆరు దాటాక పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వారికి ఓటు వేసే అవకాశం ఉండదని చెప్పారు. పోలింగ్ ముగిసేవరకు నంద్యాల నియోజకవర్గం పరిధిలో ఉన్న మద్యం దుకాణాల మూసివేతపై ఆంక్షలు ఉంటాయని..బల్క్ ఎస్ఎంఎస్‌లపై నిషేధం ఉంటుందని చెప్పారు.