కాల్చండి..ఉరి తీయండి అనే నేతకు మద్ధతిస్తారా..?

బాధ్యత గల ప్రతిపక్షనేత హోదాలో ఉండి ముఖ్యమంత్రిని కాల్చండి..ఉరి తీయండి అనే నేతకు మద్దతిస్తారా అంటూ ప్రశ్నించారు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఇవాళ ఆయన బలిజలతో ఆత్మీయ సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. కాపులను టీడీపీ నుంచి దూరం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని సీఎం ఆరోపించారు. కాపులకు, బలిజలకు రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం పార్టీయేనని అన్నారు..2014లో కాపు రిజర్వేషన్ల హామీ ఇచ్చానని..వారి ఆర్థిక పరిస్థితి చూశాకే పిఠాపురం సాక్షింగా నాడు ప్రకటన చేశానని..ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చాకా మంజునాథ కమిషన్ ఏర్పాటు చేశామని ఆయన ప్రకటించారు. నంద్యాలకు పదేళ్లపాటు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రస్తుత వైసీపీ అభ్యర్థి ఈ నియోజకవర్గానికి ఏం ఒరగబెట్టారని ఆయన ప్రశ్నించారు.