శిల్పా సహకార సమితి అక్రమాల పుట్ట

నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం తారాస్థాయికి చేరింది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగడంతో ప్రచారానికి ఊపు వచ్చింది. దీనిలో భాగంగా నంద్యాలకు చెందిన ముస్లిం మతపెద్దలతో ముఖ్యమంత్రి ఆత్మీయ సమావేశం నిర్వహించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. ముస్లింల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని..అభివృద్ధి పనులు చేసే వారికి ప్రజలు సహకరిస్తున్నారన్నారు. శిల్పా మోహన్ రెడ్డి కుటుంబం అనేక అక్రమాలకు పాల్పడిందని..శిల్పా సహకార సమితి పేరుతో ప్రజలకు రుణాలు ఇచ్చి అధిక వడ్డీ వసూలు చేస్తున్నారన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని..శిల్పా సహకర సమితిని చట్ట విరుద్ధంగా నిర్వహిస్తున్నారని రుణాలను తిరిగి చెల్లించొద్దని సీఎం పిలుపునిచ్చారు.