బాలయ్య హర్ట్....రాజకీయాలకు గుడ్ బై..!

 

ఇప్పటికే ఏపీ రాజకీయాలు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రోజుకో ట్విస్ట్ తో.. రోజుకో కొత్త విషయంతో క్షణ క్షణం ఉత్కంఠ భరితంగా మారుతున్నాయి. దీనికి తోడు ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం బయటకువచ్చింది. అదేంటంటే... నందమూరి బాలకృష్ణ రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారట. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారట. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. దీనికి పలుకారణాలు కూడా తెరపైకి వచ్చాయి.

 

2014 సార్వత్రిక ఎన్నికల్లో బాలయ్య హిందూపురం నుంచి ఎన్నికైన తర్వాత ఆయనకు తెలుగుదేశంలో మంత్రిత్వశాఖ లభిస్తుందని అందరూ ఊహించారు. కానీ వ్యూహాత్మకంగా చంద్రబాబు బాలయ్యను పక్కన పెట్టారు. ఇక ఆతరువాత ఎమ్మెల్యేగా కొనసాగుతూనే నియోజక వర్గాన్ని అభివృద్ది చేశారు. అయితే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఆ అవకాశం కూడా లేనట్టు తెలుస్తోంది. మరోసారి హిందూపురం నుంచి గెలిచి, పార్టీలో చక్రం తిప్పాలని బాలయ్య భావిస్తున్నా...ఈసారి లోకేష్ ను హిందూపురం నుంచి పోటీ చేయించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారట. అంతేకాక, తెదేపా అధిష్టానం బాలయ్యను తెలంగాణ టీడీపీ బలోపేతానికి కృషి చేయాలంటూ సూచించడంతో బాలయ్య నొచ్చుకున్నారట. తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఎంటో అందరికీ తెలిసిందే. దాంతో అక్కడ తెదేపా బలపడుతుందన్న నమ్మకం బాలకృష్ణకు లేదట. దానికితోడు.. ఆయనకు అక్కడ పెద్దగా ఫ్యాన్ బేస్ కూడా లేకపోవడం మైనస్ గా మారుతుందని భావిస్తున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో తాను రాజకీయాల్లో కొనసాగడం కంటే, చక్కగా సినిమాలు చేసుకుంటే మేలని బాలయ్య భావిస్తున్నారట. ఇప్పుడు హిందూపురాన్ని కూడా లోకేష్ కు కేటాయించేయడంతో, అల్లుడి మాట కాదనలేని బాలకృష్ణ, మనస్థాపంతో ఇక రాజకీయాలకు పూర్తిగా దూరం కావాలని నిర్ణయించుకున్నారట. మొత్తానికి నందమూరి కుటుంబంలో ఇప్పటికే పురంధరేశ్వరి, హరికృష్ణ చంద్రబాబుపై అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు బాలకృష్ణ కూడా వారి జాబితాలో చేరిపోయినట్టున్నాడు. ఏదో అల్లుడు కాబట్టి ఆలోచిస్తున్నాడు.. కానీ లేకపోతే వాళ్లలాగ తన వ్యతిరేకతను బయటపెట్టేవాడేనేమో... చూద్దాం ఇందులో ఎంత నిజముందో...