నల్గొండ లోక్‌సభ ఉప ఎన్నిక బరిలోకి రేవంత్..?

నల్గొండ టీఆర్ఎస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఆ స్థానంలో ఉప ఎన్నిక జరిగనుంది. చాలా రోజుల తర్వాత తెలంగాణలో ఎన్నికల నగరా మోగనుండటంతో ప్రధాన పార్టీలు అలర్ట్ అయ్యాయి. వచ్చే ఎన్నికలకు కొలమానంగా..ప్రజల్లో ఎవరికెంత మద్ధతు ఉందో తెలుసుకునేందుకు ఈ ఉప ఎన్నిక వేదిక కానుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆ పార్టీ అభ్యర్ధిగా ఇక్కడ బరిలో దిగే సూచనలు ఉన్నాయంటూ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

 

ప్రజల్లో పాపులారిటీతో పాటు మంచి వాగ్ధాటీ ఉన్న రేవంత్ అయితేనే అధికార పార్టీకి సరైన పోటీ ఇవ్వగలరని టీడీపీ అధినాయకత్వం భావిస్తోందట. దీనికి తోడు తెలుగుదేశానికి ఇక్కడ బలమైన క్యాడర్‌తో పాటు రెడ్డి సామాజిక వర్గం అండదండలున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన టీడీపీ ఇక్కడ రెండో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో రేవంతో బరిలోకి దిగితే విజయం తథ్యమని..కొందరు భావిస్తున్నారు..అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం ఏమిటా అనేది తేలాల్సి ఉంది. రేవంత్ లాంటి నేత నిలబడితే తమ తరపున ఎలాంటి అభ్యర్థిని నిలబెట్టాలా అని గులాబీ అధినేత, సీఎం కేసీఆర్ కసరత్తు ప్రారంభించారట. ఇప్పటికే తనకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్ని ఒక్కటి కావడంతో షాక్‌కు గురైన సీఎం..ఈ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలిచి తన సత్తా ఏమిటో చూపించాలని భావిస్తున్నారట.