నాగపూర్‌ బీజేపీ వశం

మహారాష్ట్రలోని పెద్ద నగరాల్లో ఒకటైన నాగపూర్ కార్పోరేషన్ బీజేపీ వశమైంది. మొత్తం 151 డివిజన్లకు గాను బీజేపీ 70 స్థానాలను, కాంగ్రెస్ 30 స్థానాలను కైవసం చేసుకున్నాయి. శివసేన ప్రభావం అంతగా కనిపించలేదు..కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కమలం ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. ఇక శరద్ పవర్ నాయకత్వంలోని ఎన్సీపీ కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. పూర్తి ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది.