జూన్ 3న బీజేపీలోకి నాగం

 

 nagam janardhan reddy, bjp nagam janardhan reddy

 

 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం విషయంలో ద్వంద వైఖరి అవలంభిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబుతో విభేదించి తెలంగాణ నగారా సమితి ఏర్పాటు చేసిన నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి జూన్ 3న భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. టీడీపీ నుండి ఎన్నికయిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన నాగం 28 వేల ఓట్ల మెజార్టీ సాధించాడు. అయితే అనూహ్యంగా ఆయన బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నాడు. ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ను కలిసిన ఆయన ఉగాది నాడే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉగాది వేడుకలకు హాజరై తాను బీజేపీలో చేరతానన్న సంకేతాలు ఇచ్చారు. ఈ సారి మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి పోటీ చేస్తానని ప్రకటించారు. నరేంద్రమోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే బీజేపీకి మంచి ఊపు వస్తుందని అయన అన్నారు.