ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తోన్న పెద్దపల్లి ఎమ్మెల్యే చెల్లి ఫ్యామిలీ మృతి!

తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో మిస్టరీ జరిగింది. గత ఆదివారం రాత్రి దంపతుల బైక్ పై వెళ్తున్నారు. సడెన్ గా కళ్ళలో పురుగు పడటంతో దంపతులు బైక్ తో సహా కాకతీయ కాలువలో పడిపోయారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వారిని రక్షించటానికి చేసిన ప్రయత్నంలో ఒక్కరినే కాపాడ గలిగారు. ఆ ప్రమాదంలో భార్య చనిపోయింది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. బైక్ కోసం వెతుకుతున్న సమయంలో నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో స్థానికులు అధికారులకు సమాచారమిచ్చి లోయర్ మానేరు నుంచి నీటి విడుదలను ఆపేశారు. అయితే నీటి మట్టం తగ్గడంతో అనూహ్యంగా కాకతీయ కాలువలో ఓ మునిగి పోయిన కారు బయటపడింది. కారును వెలికితీసిన స్ధానికులు కారు నెంబర్ ఆధారంగా పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చెల్లి.. బావ వాళ్ళ కూతురు అని గుర్తించారు. కారులో వెనక సీట్లో సత్యనారాయణరెడ్డి ఆయన భార్య రాధిక కూతురు వినయశ్రీ మృతదేహాలను బయటకు తీశారు. స్వయాన ఎమ్మెల్యే బంధువులు అవడంతో అంతా ఎలెర్ట్ అయ్యారు. 

అసలు విషయంలోకి వెళ్తే.. జనవరి 27 మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో మొబైల్ స్విచాఫ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కుటుంబం ఏమైందో ఎక్కడికి వెళ్లిందో? ఆరా తీసిన వారే లేరు. ఇంట్లోంచి బయలుదేరినవాళ్లు గమ్యానికి చేరుకోలేదు. అలాగని ఇంటికి రాలేదు. ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా ఇది ప్రమాదమేనా? ప్రమాదంలా సృష్టిస్తున్నారా? అనే డౌట్స్ పుట్టుకొచ్చాయి. అంతేకాకుండా ముందు సీట్లో ఎవ్వరూ లేరు అదెలా సాధ్యం? మొదటి అనుమానం. కారు ప్రమాదాన్ని ఎవరూ గుర్తించ లేదా? అన్నది రెండవ అనుమానం. పైగా కుటుంబం లోని ముగ్గురు 20 రోజులుగా కనిపించకుండా పోయినా ఎవ్వరూ కంప్లైంట్ ఇవ్వలేదు? ఇది మూడో అనుమానం. జనవరి 29వ తేదీన సత్యనారాయణరెడ్డి ఇంటి తాళాలు పగుల గొట్టి వెతికారని చెబుతున్నారు. తాళం పగలగొట్టి దేనికోసం వెతికారు? అన్నది నాలుగవ అనుమానం. వారం క్రితం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో సత్యనారాయణరెడ్డి నంబర్ టవర్ లోకేషన్ తెలుసుకోవాలని ఓ వ్యక్తి పోలీసులను అడిగాడు. కంప్లైంట్ ఇవ్వండి వెతికిపెడతాం? అన్నారు పోలీసులు. అంతే అడిగి వస్తానని చెప్పి వెళ్లిపోయిన వ్యక్తి మళ్లీ రాలేదు ఇది అయిదవ అనుమానం. సోదరి.. బావ మృతి చెందడం తమ కుటుంబానికి తీరని లోటన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. గత నెలలో వారంతా బయటకు వెళ్ళారని.. తన బావ వ్యాపారం చేసుకుంటాడనీ.. చెల్లెలు టీచర్ అని చెప్పారు. ఆర్థికంగా వారికి ఎలాంటి సమస్యా లేదని అసలు ఎలా జరిగిందో తెలియదని ఎమ్మెల్యే తెలిపారు.