కరెంట్ బిల్లు ఎగ్గొట్టిన ములాయం..

 

సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం మరోసారి అడ్డంగా బుక్కయ్యారు. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా..? కరెంట్ బిల్లు విషయంలో. అసలు సంగతేంటంటే.. ములాయం నివాసంలో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు వ్యాపించాయి. దీంతో విద్యుత్‌ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు ఆర్పారు. ఆతరువాత మీటర్‌ చెక్‌ చేయగా అసలు విషయం బయటపడింది. ములాయం ఇంట్లో కేవలం 5 కిలోవాట్ల విద్యుత్ సరఫరా చేసే మీటర్ ఉండగా..ములాయం మాత్రం 40 కిలోవాట్ల విద్యుత్‌ వాడుతున్నట్లు తెలిసింది. అంతేకాదు కరెంటు బిల్లు కూడా 5 కిలోవాట్లకు మాత్రమే కడుతున్నట్టు తెలిసింది. దీంతో విద్యుత్‌ సిబ్బంది పాత మీటర్‌ స్థానంలో 40 కిలోవాట్ల మీటర్‌ ఏర్పాటు చేశారు. ఇంకా బకాయి పడ్డ రూ.4లక్షలను నెల రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించారు.