కట్టు భద్రతతో ఉన్నావ్ భాదితురాలి అంత్యక్రియలు...

యూపీలోని ఉన్నావ్ అత్యాచార బాధితురాలి మరణం పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. నిందితులు కిరోసిన్ పోసి నిప్పంటించడంతో 90% తొంభై శాతం కాలిపోయిన బాధితురాలు 40 గంటలు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. సీఎం యోగి ఆదిత్య నాథ్ చేంతవరకు అంత్యక్రియలు నిర్వహించబోమని బాధితురాలి కుటుంబ సభ్యులు చెప్పడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తన కుమార్తె ఇప్పటికే దహనమైపోయిందని అందుకే ఆమెను ఖననం చేస్తామని అది కూడా సీఎం వచ్చిన తరవాతే జరుగుతుందని బాధితురాలి తండ్రి స్పష్టం చేశారు. సీఎం యోగి తోనే తాము ప్రత్యక్షంగా మాట్లాడతామని పేర్కొంది. కుటుంబాన్ని లక్నోకు తీసుకువెళ్ళి సీఎంతో మాట్లాడిస్తామని జిల్లా అధికారులు చేసిన ప్రతిపాదనను తిరస్కరించారు.`ఉన్నవ్ లో పరిస్థితి అంతకంతకూ ఉద్రిక్తంగా మారడంతో శాంతి భద్రతల పరిరక్షణ కోసం 500 మంది పోలీసులను రంగంలోకి దించారు.

బాధితురాలి మృతదేహం అక్కడే ఉంటే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండటంతో పోలీసులు బలవంతంగా మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు. ఉన్నావ్ సమీపంలోని బాధితురాలి మృతదేహాన్ని ఖననం చేశారు. ఈ కార్యక్రమంలో బాధితురాలి కుటుంబ సభ్యులు పలు పార్టీ లకు చెందిన నేతలు పాల్గొన్నారు. ఉన్నవ్ బాధితురాలి మృతి పై ఇప్పటికే సీఎం యోగి ఆదిత్య నాథ్ స్పందించారు. ఆమె మృతి చాలా బాధాకరమన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు మంజూరు చేస్తామ ని ప్రకటించారు. మరోవైపు లక్నో నుంచి ఇద్దరు మంత్రుల్ని అయిన ఉన్నావ్ కు పంపిచ్చారు. కానీ వారిని గ్రామస్తులు ఊర్లోకి అనుమతించలేదు. కాన్వాయ్ ని అడ్డుకుని నిరసన తెలిపారు.ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి కేసును టేకప్ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అయితే బాధితురాలి కుటుంబ సభ్యులు మాత్రం తమకు సత్వర న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్నారు.

ఉన్నవ్ లో పరిస్థితి చేయిదాటుతోందని ఇంటెలిజెన్స్ ఇప్పటికే హెచ్చరించింది. అయితే ప్రభుత్వం మాత్రం ప్రతిపక్షాల రాద్ధాంతం వల్లే సమస్య పెద్దదవుతున్నట్టు మండిపడుతోంది.మొత్తంగా ఉన్నవ్ నివురుగప్పిన నిప్పులా మారింది.  దేశ కేసులో హైదరాబాద్ పోలీసు లు ఏం చేశారో అచ్చంగా అటువంటి న్యాయమే కావాలంటున్నారు బాధితురాలి తల్లిదండ్రు లు నరరూప రాక్షసుల ను ఎన్ కౌంటర్ చేయడమే కరెక్ట్ అన్న వాదన వినిపిస్తున్నారు. మరి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.