ధోనీకి సుప్రీం కోర్టులో ఊరట..ధోని తప్పేం లేదు..

 

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీకి సుప్రీం కోర్టులో లభించింది. 2013, ఏప్రిల్‌లో బిజినెస్ టుడే మేగజైన్ కవర్‌పై విష్ణుమూర్తి ఆకారంలో ధోని ముఖచిత్రం ప్రచురితమైన సంగతి తెలిసిందే. దీంతో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ అప్పట్లో అనంతపురం జిల్లా కోర్టులో కేసు వేశారు. బెంగళూరు కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. ఆ తర్వాత ఈ కేసు సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఈ నేపథ్యంలో దీనిపై విచారణ  జరిపిన సుప్రీంకోర్టు..  ధోనీ ఉద్దేశపూర్వకంగా లేదా కించపరచాలనే భావనతో చేయలేదని పేర్కొంటూ కేసును కొట్టివేసింది.