ధోని ఫోన్లు పోలేదు... పొరపాటు అంతే...


టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ ఫోన్లు చోరికి గురయ్యాయని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఫోన్లు దొరికినట్టు తెలుస్తోంది. విజయ్ హజారే ట్రోఫిలో భాగంగా ధోనితో పాటు మరికొందరు క్రికెటర్లు ఢిల్లీలోని ద్వారక హోటల్లో బస చేశారు. అయితే హోటల్ లో ప్రమాదం చోటు చేసుకోవడంతో వారందరూ హోటల్ నుండి బయటకు వచ్చేశారు. కొద్దిసేపటి తర్వాత గదిలోకి వెళ్లిచూస్తే అక్కడ ఉంచిన మూడు సెల్‌ఫోన్లు కనిపించకుండాపోయాయి. దీంతో ధోనీకి చెందిన మూడు ఫోన్లు క‌నిపించ‌కుండా పోవడంతో పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. ధోనీ బ‌స ఉంటున్న హోట‌ల్‌ అగ్ని ప్రమాద సమయంలో ఆటగాళ్లను వేరే ప్రాంతానికి తరలించే క్ర‌మంలో ఆ ఫోన్ల‌న్నింటినీ అగ్రిమాపక సిబ్బంది తీసి భద్రంగా ఉంచార‌ట‌. ఆ ఫోన్లను తిరిగి తీసుకున్న‌ పోలీసులు వాటిని భద్రంగా ధోనీకి అప్పగించారు. ఇది పొరపాటే తప్ప దొంగతనం కాదని ఢిల్లీ పోలీసులు తెలిపారు.