చిరంజీవి గారూ.. ఇల్లు ఖాళీ చేయండి సారూ...
posted on Nov 13, 2014 9:33PM

యూపీఏ-2 సర్కారులో కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించిన కాంగ్రెస్ నాయకుడు చిరంజీవి తన అధికారిక నివాసాన్ని తక్షణం ఖాళీచేయాలని ఎస్టేట్ డెరైక్టరేట్ అధికారులు అక్బర్ రోడ్డులోని 17వ నెంబరు ఇంటికి నోటీసులు అంటించారు. మంత్రిపదవి ఊడిపోయినప్పటికీ ఇప్పటికీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న చిరంజీవి ఇదే నివాసంలో కొనసాగాలని భావించారు. అయితే మంత్రులకు కేటాయించాల్సిన ఈ క్వార్టర్‌ను ఎంపీకి కేటాయించలేమని అధికారులు స్పష్టంగా తేల్చిచెప్పారు. ఈ ఏడాది జూన్ 27వ తేదీ నాటికే గడువు ముగిసిందని గతంలోనే అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే చిరంజీవి ఇప్పటికీ ఇల్లు ఖాళీ చేయకపోవడంతో తక్షణం ఇల్లు ఖాళీ చేయాలని ఆదేశిస్తూ ఆ ఇంటికి నోటీసులు అతికించారు. మరి ఎంపీ చిరంజీవి గారు ఇప్పటికైనా ఇల్లు ఖాళీ చేస్తారో లేదో చూడాలి.