కేరళ బీజేపీ అభ్యర్థిగా మోహన్ లాల్..!!

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కేరళ బీజేపీకి అండగా నిలబడనున్నారా? అంటే అవుననే మాటే వినిపిస్తుంది.. అంతేకాదు ఆయన తిరువనంతపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి కూడా దిగబోతున్నారట.. ఈ ఊహాగానాలకు కారణం కూడా ఉందిలేండి.. తాజాగా మోహన్ లాల్ ఢిల్లీ వెళ్లి మోడీతో భేటీ అయ్యారు.. కాంగ్రెస్‌ నేత శశథరూర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న తిరువనంతపురం నుంచి మోహన్‌లాల్‌ను అభ్యర్థిగా  నిలబెట్టేందుకు భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లు యోచిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.. మోహన్‌లాల్‌ బీజేపీలో చేరితో కేరళలో పార్టీకి బలం చేకూరుతుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

 

 

అయితే బీజేపీ శ్రేణులు మాత్రం ఈ వార్తలను ఖండిస్తున్నాయి.. ఈ భేటీలో రాజకీయ ప్రాధాన్యం లేదంటున్నాయి.. మోహన్ లాల్ కూడా ఈ భేటీ గురించి మాట్లాడుతూ 'మేము నిర్వహిస్తున్న విశ్వశాంతి ఫౌండేషన్‌ అందిస్తున్న సేవల గురించి ప్రధానికి వివరించా.. వరదల బీభత్సంతో అల్లాడుతున్న కేరళను అన్నివిధాలుగా ఆదుకుంటామని ప్రధాని భరోసా ఇచ్చారు.. అలాగే నవ కేరళ ఆవిష్కరణకు ఏర్పాటు చేయనున్న అంతర్జాతీయ మలయాళీ సదస్సులో పాల్గొనడానికి కూడా హామీ ఇచ్చారు' అని అన్నారు.. మరోవైపు మోహన్ లాల్ తో భేటీ గురించి మోదీ కూడా ట్వీట్ చేసారు.. 'ప్రజల పట్ల ఆయనకెంతో ప్రేమ, నిబద్దతలున్నాయి.. విస్తృత స్థాయిలో ఆయన చేస్తున్న సంఘసేవ ఎంతో ఆదర్శనీయం' అని పేర్కొన్నారు.. ప్రస్తుతానికి పూర్తిగా క్లారిటీ లేదు కానీ త్వరలో మోహన్ లాల్ బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నట్టు వార్తలు మాత్రం వస్తున్నాయి.. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో.