మోహన్ బాబు ఫొటో వెనుక సీక్రెట్ అదేనా...!

 

ప్ర‌ముఖ సినీన‌టుడు, క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు రాజకీయానుభవం గురించి అందరికీ తెలిసిందే. గతంలో ఎన్టీఆర్ హయాంలో టీడీపీ పార్టీలో ఓ వెలుగు వెలిగారు మోహన్ బాబు. రాజ్య‌స‌భ‌కు కూడా ఎంపిక‌య్యారు. ఆ తరువాత రాజకీయానుండి బయటకు వచ్చేశారు. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. అయితే దూరంగా ఉన్నా కానీ.. రాజకీయ నాయకులతో మాత్రం ఆయనకు మంచి రిలేష‌నే ఉంది. అయితే ఇప్పుడు మోహన్ బాబు  షేర్ చేసిన ఓ ఫొటో చూస్తుంటే మళ్లీ ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇంతకీ ఆయన షేర్ చేసిన ఫొటో ఏంటనుకుంటున్నారా...? మోహ‌న్‌బాబు డైన‌మిక్ లీడర్స్ గా పేరుగాంచిన పరిటాల రవి, దేవినేని నెహ్రులతో మోహన్ బాబు దిగిన అరుదైన ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేశారు. దేవినేని నెహ్రు గతంలో టీడీపీలో కీలక నేతగా ఉన్నారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్లారు. ఆయ‌న చ‌నిపోయే ముందే తిరిగి టీడీపీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక ప‌రిటాల రవి చివ‌రి వ‌ర‌కు టీడీపీలోనే ఉన్నారు. ఇప్పుడు మోహన్ బాబు ఫొటో షేర్ చేయడంతో.. 2019 ఎన్నికల నాటికి మోహ‌న్‌బాబు టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలతో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటున్నారని కూడా రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.