ఎన్నికల్లో తమ ఓటు హక్కును ఉపయోగించుకుంటున్న నేతలు...

 

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు పదహారు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని యాభై యొక్క అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మహారాష్ట్రలోని సతారా, మధ్యప్రదేశ్ లోని సమస్తిపూర్ లోకసభ స్థానాలకు బైపోల్స్ జరుగుతున్నాయి. 

నాగపూర్ లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజా ప్రతినిధులను ఓటు వేసి ఎన్నుకోవటం ఓటర్ల హక్కు అని మోహన్ భగవత్ ఈ సందర్భంగా తెలిపారు. ఎన్ని పనులున్నా పక్కన పెట్టి అంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఇక హర్యానాలోని దాద్రి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కుస్తీ క్రీడాకారిణి బబితా ఫోగట్ బలాలీలోని ఓ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. హర్యానా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కుమారి సెల్జా హిస్సార్ లోని యశోదా పబ్లిక్ స్కూల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదంపూర్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న టిక్ టాక్ స్టార్ సొనాలీ ఫోగట్ ఓటువేసారు. బీజేపీ కూటమికి మహారాష్ట్రలో రెండు వందల ఇరవై ఐదు సీట్లు వస్తాయని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. మోదీ ఫడ్నవీస్ తోనే జనం ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. 

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తన సతీమణి కంచన్ తో కలిసి నాగపూర్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీ విజయం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్సీపీ నాయకురాలు సుప్రియా సూలే బారామతిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారీ మహారాష్ట్రలో అధికారంకి వచ్చేది కాంగ్రెస్ ఎన్సీపీ కూటమేనని సూలే ధీమా వ్యక్తం చేశారు. 

హర్యాణలోని బాద్ షాపూర్ లో ఉన్న రెండు వందల ఎనభై ఆరువ నెంబర్ పోలింగ్ బూత్ లో ఈవీఎంలు మొరాయించటంతో కొద్ది సేపు పోలింగ్ నిలిచిపోయింది. మహారాష్ట్ర లోని రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు మూడు వేల రెండు వందల ముప్పై ఏడు మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో రెండు వందల ముప్పై ఐదు మంది మహిళలే ఉన్నారు. మరోవైపు హర్యానాలోని తొంభై స్థానాలకు గాను పదకొండు వందల అరవై తొమ్మిది మంది పోటీ పడుతున్నారు. ఇందులో నూట నలుగురు మహిళలు. మహారాష్ట్రలో రెండవసారి అధికార పీఠాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో బీజేపీ తన ప్రధాన మిత్రపక్షమైన శివసేనతో కలిసి బరిలోకి దిగింది. మరోవైపు గత వైభవాన్ని సాధించాలన్న లక్ష్యంతో ప్రతిపక్ష కాంగ్రెస్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలు పొత్తుతో పోటీలో నిలిచాయి. రాజ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేనతో పాటు పలు ఇతర పార్టీలు తమ అభ్యర్థులను నిలిపాయి. దాదాపు పద్నాలుగు వందల మంది స్వతంత్ర అభ్యర్ధులు పోటీలో నిలిచారు. 

హర్యాణలో రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ రెండోసారి కూడా విజయ ఢంకా మోగించాలన్న పట్టుదలతో ఉంది. ఐఎన్ఎల్డీ నుంచి వేరుపడి చౌతాలా కుటుంబీకులు స్థాపించిన జన్ నాయక్ జనతా పార్టీ తొలిసారి పోటీ చేస్తూ సత్తాచాటాలి అన్న సంకల్పంతో ఉంది. ఐఎన్ఎల్డీ కూడా పట్టు కోసం ప్రయత్నిస్తోంది. మూడు వందల డెబ్బై ఐదు మంది స్వతంత్రులు ఇక్కడ బరిలో ఉన్నారు.ఎన్నికల ఫలితాలు వస్తే కానీ తమ పార్టీ నేతల ప్రయత్నాలు సఫలీకృతమైయ్యయా అన్నది వేచి చూడాలి.