పుల్వామాలో జవాన్లు మరణిస్తే...షూటింగ్ లో మోడీ...ఇదే అసలు విషయం !

 

''పుల్వామా దాడి జరిగినరోజు జవాన్ల మృతి గురించి తెలిసి దేశమంతా దిగ్భ్రాంతికి గురైంది. కానీ ప్రధాని మోదీ మాత్రం జిమ్ కార్బెట్ పార్క్‌లో సాయంత్రం దాకా ఓ షూటింగ్‌లో బిజీగా గడిపారు. ఇలాంటి ప్రధాని ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటాడా..? నిజంగా ఆయన గురించి ఇంకేం మాట్లాడాలో తెలియట్లేదు'' అని పుల్వామా దాడి జరిగిన వారం రోజుల తర్వాత ప్రధాని మోడీని ఉద్దేశించి రణదీప్ సూర్జేవాలా అనే కాంగ్రెస్ నేత చేసిన కామెంట్స్ ఇవి. 

ఫిబ్రవరి 14న పుల్వామా దాడి జరిగిన రోజున ప్రధాని మోదీ ఉత్తరాఖండ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా జిమ్ కార్బెట్ నేషనల్ పార్కును సందర్శించిన ఆయన తన ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రతిబింబించే ఓ డాక్యుమెంటరీ షూటింగ్‌లో పాల్గొన్నారని, డిస్కవరీ సంస్థ చిత్రీకరించిన ఈ డాక్యుమెంటరీ వచ్చే నెలలో టెలికాస్ట్ కానుందని అప్పట్లో మీడియాలో ప్రచారం జరిగింది. 

ఈ డాక్యుమెంటరీ చిత్రీకరణ జరుగుతున్న రోజు మధ్యాహ్నామే కశ్మీర్‌లోని పుల్వామాలో భారత జవాన్లపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ నేపథ్యంలోనే ఓవైపు జవాన్లపై దాడి జరుగుతుంటే మరోవైపు మోదీ షూటింగ్‌లతో బిజీగా ఉన్నారంటూ విపక్షాలు ఆయన్ను టార్గెట్ చేశాయి.  దీంతో స్వీయ రక్షణలో పడిన మోడీ సర్కార్ సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో తమకు మద్దతు ఇచ్చే టెలివిజన్‌ ఛానల్‌ చేత ఓ వార్తా కథనాన్ని ప్రసారం చేయించింది. 

‘పుల్వామా దాడి గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ సకాలంలో సమాచారాన్ని అందించలేక పోయారు.  ఆ తర్వాత ఈ విషయన్ని తెలుసుకున్న ప్రధాని మోదీ, దోవల్‌ను మందలించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల ప్రధానికి దోవల్‌ సమాచారాన్ని అందించలేకపోయారని ఆ కధనాల సారాంశం. 

అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది అంటే,  అప్పట్లో కాంగ్రెస్ ఆరోపించినట్టే మోడీ పాల్గొంది డాక్యుమెంటరీలో కాదు. అది అదో రకమైన షో. దాని పేరు “మ్యాన్ వర్సెస్ వైల్డ్”. అడవిలో తప్పిపోతే ఎలా బతకాలి, ఏమేం తినొచ్చు, ఏమేం చేయాలి ? అనే కాన్సెప్ట్‌తో ఈ షో రూపొందుతోంది. దీన్ని డిస్కవరీ చానల్ ఆగస్టు 12వ తేదీన ప్రసారం చేయబోతోంది. 

మ్యాన్ వర్సెస్ వైల్డ్ షోను బేర్ గ్రిల్స్ అనే స్టార్ హోస్ట్ నిర్వహిస్తూంటారు. చాలాకాలం అడవులు, పర్వతాల్లో గడిపానని.. తన జీవితంపై వాటి ప్రభావం చాలా ఉందని మోడీ అప్పుడప్పుడూ చెబుతూంటారు. ఇప్పుడు ఈ షోలో ఆ అనుభవాన్ని ఉపయోగించుకున్నారన్న మాట. బేర్ గ్రిల్స్ చాలా మంది దేశాధ్యక్షులతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించారు. 2015లో అమెరికా అధ్యక్షునిగా ఉన్న ఒబామాతోనూ ఒక ఎసిసోడ్‌ చేశారు. 

నిజానికి ఇది నెలలోనే రిలీజ్ చేయాలని అనుకుని ఉండచ్చు, ఎన్నికల్లో మోడీకి ఉపయోగాపడుతుందని భావించి ఉండచ్చు, కానీ పుల్వామా ఎతాక్స్ వలన ఆ సమయంలో మోడీ స్పందించక పోవడం అనే అంశం ఎక్కువ ఫోకస్ అవుతుందని భావించి దానిని ఆపేసి ఉండచ్చు. ఇప్పుడు పూర్తి మెజారిటీతో బీజేపీ మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఇప్పుడు ప్రసారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండచ్చని విశ్లేషకులు అంటున్నారు.