ఎట్టకేలకు ఆ విషయంలో జగన్ కు ఓకే చెప్పిన మోడీ!!

 

 

ఏపీలో వైఎస్ జగన్ అధికారం చేపడుతూనే తనకె కావలసిన టీం పై వర్క్ చేసి తెలంగాణ లో పని చేస్తున్న ఇద్దరు అధికారులు స్టీఫెన్ రవీంద్ర ఐపీఎస్, శ్రీలక్ష్మి ఐఏఎస్ లను ఏపీకి డిప్యూటేషన్ పై పంపించాలని కెసిఆర్ ను రిక్వెస్ట్ చేయగా దానికి అయన ఓకే చెప్పటం జరిగింది. ఐతే ఇదే విషయమై కేంద్రానికి విజ్ఞప్తి చేసినప్పటికీ అక్కడి నుండి సంధానం లేదు. దీనితో  ఎంపీ విజయ సాయి రెడ్డి ఢిల్లీలో ఉండి కేంద్రం వద్ద లాబీ చేసిన ఫలితం లేకుండా పోయింది. మరోసారి అయన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ని తీసుకుని స్వయంగా అమిత్ షాను కలిసినా కూడా కేంద్రం నుండి ఎటువంటి స్పందన లేదు. ఐతే మొన్న ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్ స్వయంగా ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ని తీసుకుని వెళ్లి ప్రధాని మోడీని కలవడం తో ఇప్పుడు కేంద్రం ఆ ఇద్దరు అధికారుల బదిలీకి ఓకే చెప్పింది. సీఎం జగన్ అమెరికా పర్యటనకు వెళ్లి వచ్చేటప్పటికి అధికారులు స్టీఫెన్ రవీంద్ర, శ్రీలక్ష్మి లు ఏపీలో రిపోర్ట్ చేయవచ్చని సమాచారం.