కర్ణాటక సీఎం కుమార స్వామికి మోడీ ఛాలెంజ్

కర్ణాటక అనగానే ఈమధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికలే ముందుగా గురొస్తాయి.. సీట్లు ఎక్కువొచ్చిన బీజేపీ, ఓట్లు ఎక్కువొచ్చిన కాంగ్రెస్ కాకుండా.. అనూహ్యంగా కాంగ్రెస్ మద్దతుతో జేడీఎస్ నేత కుమార స్వామి సీఎం అయ్యారు.. దీంతో బీజేపీ, జేడీఎస్ లు ప్రత్యర్ధులు అయ్యాయి.. మరి ప్రత్యర్థి పార్టీ నేత కుమార స్వామికి, మోడీ ఛాలెంజ్ విసరటం కామనేగా అనుకుంటాం..

కానీ ఇక్కడొక ట్విస్ట్ ఉంది.. మోడీ, కుమారస్వామికి పొలిటికల్ ఛాలెంజ్ విసరలేదు, ఫిట్నెస్ ఛాలెంజ్ విసిరారు.. క్రీడల శాఖామంత్రి రాజ్యవర్ధన్ సింగ్ ‘హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్’ అంటూ వ్యాయామం చేస్తున్న వీడియో పోస్ట్ చేసి కోహ్లీ, సైనా నెహ్వాల్ లాంటి వారిని ఛాలెంజ్ చేసిన సంగతి తెలిసిందే.. ఆ ఛాలెంజ్ స్వీకరించిన కోహ్లీ, జిమ్ చేస్తున్న వీడియో పోస్ట్ చేసి.. మోడీ, ధోని లాంటి వారిని ఛాలెంజ్ చేసాడు.

ఈ ఛాలెంజ్లో భాగంగా మోడీ వ్యాయామం చేస్తున్న వీడియో పోస్ట్ చేసి.. కర్ణాటక సీఎం కుమారస్వామితో పాటు, 2018 కామెన్వెల్త్ గేమ్స్ లో పతకాలు సాధించిన మానికా బాత్రాకు మరియు 40 ఏళ్లకు పైబడిన ఐపీఎస్ అధికారులకు ఛాలెంజ్ చేసారు.. ప్రత్యర్థి పార్టీ నేతకి మోడీ ఫిట్నెస్ ఛాలెంజ్ విసరడంతో అందరూ షాక్ అవుతున్నారు.. అయితే కుమారస్వామి మాత్రం మోడీ ఫిట్నెస్ ఛాలెంజ్ కి పాజిటివ్ గా స్పందించారు.

'నా ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపినందుకు ధన్యవాదాలు, ప్రతిరోజు నేను యోగ చేస్తాను, ఇప్పటినుండి రాష్ట్ర అభివృద్ధి మీద ఇంకా ఎక్కువ శ్రద్ద పెడతాను దానికి మీ సపోర్ట్ కావాలంటూ' కుమారస్వామి ట్వీట్ చేసారు.. మరి ప్రత్యర్థుల మధ్య ఏర్పడిన ఈ ఫిట్నెస్ ఛాలెంజ్ బంధం ఎంత దూరం ప్రయాణిస్తుందో చూడాలి.