మేము రాము.. వీళ్ల అసలు రంగు బయటపడింది...


ఎంత పెద్ద దొంగ అయినా ఏదో ఒక చిన్న తప్పు చేసి దొరికిపోతాడు. అలాగే ఎంత కవరింగ్ చేసినా... ఎన్ని మాటలు చెప్పినా ఆఖరికి రాజకీయ నేతల వేసుకునే ముసుగు తొలగించక తప్పదు. ఇప్పుడు అదే జరిగింది. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు మరోసారి తాము బీజేపీ తొత్తులే అని నిరూపించాయి. ఏపీ ప్రత్యేక హోదా పోరాటంలో ఈ విషయం ఎప్పుడో అర్ధమైంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని రాష్ట్రం మొత్తం ఆందోళనలు చేపడుతూనే ఉంది. ఏపీ ఎంపీలందరూ అవిశ్వాస తీర్మానం పెట్టి పార్లమెంట్లో పెద్ద ఎత్తున నిరసనలు కూడా చేశారు. కానీ ఈ తీర్మానం చర్చకు రాకుండా టీఆర్ఎస్ నేతలు, అన్నాడీఎంకే నేతలు అడ్డుపడ్డారన్న విషయం అందరూ గమినించారు. అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా రెండు పార్టీలు చేసిన రాజకీయ డ్రామా వెనుక బీజీపే ఉందన్న విషయం అప్పుడే అర్దమైంది అందరికీ. దేశంలో అన్ని పార్టీలు, ఈ రెండు పార్టీల చేత, బీజేపీనే గోల చేయిస్తుంది అని విమర్శలు కూడా చేసాయి. ఇక ఆ తరువాత టీఆర్ఎస్ నేతలు మద్దతిస్తున్నామని వెనక్కి తగ్గినా.. అన్నాడీయంకే మాత్రం కొనసాగించింది.

 

ఇక ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల నేతలు తీసుకున్న నిర్ణయం చూస్తుంటే నిజంగానే వీరు మోడీ తొత్తులు అనేది మరోసారి స్పష్టం అయ్యింది...దక్షిణ రాష్ట్రాలపై కేంద్రం చిన్న చూపు చూస్తున్న నేపథ్యంలో  రోజు, కేరళ రాజధాని తిరువనంతపురంలో దక్షిణాది రాష్ట్రాల ఆర్థికశాఖ మంత్రులు, కార్యదర్శుల సమావేశం ఏర్పాటు చేసి.. కేంద్రానికి వ్యతిరేకంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయబోతున్నారు. అయితే, ఈ సమావేశానికి రావటం లేదు అంటూ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల మంత్రులు కబురు పంపించారు. కేరళలో భేటీకి వెళ్లడం లేదని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించగా.... తమిళనాడులోని పళనిస్వామి ప్రభుత్వం కూడా ఈ సమావేశానికి హాజరు కారాదని నిర్ణయించింది.

 

దీంతో పూర్తి క్లారిటీ వచ్చేసిందని అంటున్నారు దక్షిణ రాష్ట్ర రాజకీయ నేతలు. అంతేకాదు ఇన్ని రోజులు మోడీకి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ పెడతానని చెప్పి కేసీఆర్ డ్రామాలాడారని.. అన్నాడీఎంకే నేతుల కావేరి నది జలాలపై పోరాటం అని కలరింగ్ ఇచ్చారని.. వీళ్ల అసలు రంగు ఇదే అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి తమని ఏమన్నా ఊరుకోని కేసీఆర్ ఇప్పుడు ఈ విషయంపై ఎలా స్పందిస్తారో చూద్దాం..