మోడీని వణికిస్తున్న అద్వానీ..

 

ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ చంద్రబాబు బీజేపీతో విడిపోయి.. మోడీపై తిరుగుబాటు బావుటా ఎగరవేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం కూడా పెట్టించారు. అయితే కేంద్రం మాత్రం అవిశ్వాస తీర్మానం చర్చకు రానివ్వడం లేదన్నది ప్రతిఒక్కరి వాదన.  చంద్రబాబుకి ప్రతిపక్షపార్టీలన్నీ మద్దతుగా నిలవడంతో.. మోడీ భయపడి కావాలనే ఇలా చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు మరో వాదన కూడా వినిపిస్తోంది.. టీడీపీ అవిశ్వాసం అయితే పెడుతుంది గానీ ప్రభుత్వాన్ని పడగొట్టలేదు అని తెలుసు. అలాంటిది బాబుకి మోడీ ఎందుకు ఇంతలా భయపడుతున్నారని కూడా అనుకుంటున్నారు.

 

అయితే ఇప్పుడు అసలు విషయం బయటపడింది. అసలు మోడీ భయపడేది చంద్రబాబుకి కాదట.. బీజేపీ సీనియర్ నేత అద్వానీకట. ఆశ్చర్యంగా ఉంది కదా.. అసలు కథ ఏంటంటే... ఇప్పటికే అద్వానికీ దక్కాల్సిన ప్రధాని పదని మోడీ దక్కించుకున్నారు. ఆ తరువాత కూడా బీజేపీ లో తనకు ఎన్ని అవమానాలు జరుగుతున్నా మౌనంగా భరిస్తూవచ్చారు. కానీ ఇటీవల జరిగిన ఓ ఘటనను మాత్రం అద్వానీయే కాదు.. ఎవరూ మర్చిపోలేకపోతున్నారు. త్రిపుర లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు సందర్భంగా మోడీ సహా బీజేపీ పెద్దలు అక్కడకి వెళ్లిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా మోడీ అందరికీ నమస్కారం చేశారు కానీ..అక్కడే ఉన్న అద్వానిని మాత్రం పట్టించుకోలేదు. అంత పెద్ద వయసులో ఉన్న ఆయన నమస్కారం పెడితే.. ప్రతినమస్కారం కూడా చేయకుండా ఆయన్ని  గుర్తించినట్టు ప్రవర్తించారు. ఇక ఈ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది. ప్రధాని ప్రవర్తించిన తీరు చూసి అందరూ మోడీని ఓ రేంజ్లో ఏకిపారేశారు. ఇక అంతకుముందు నుండే అద్వాని అనుచరులు మోడీపై కోపంగా ఉన్నా.. ఇక ఈ ఘటన తరువాత ఇంకా ఆవేశంతో రగిలిపోతున్నారట. దాంతో అవిశ్వాసం చర్చ కనుక ఓటింగ్ కు వస్తే.. అద్వాని అనుచరులు తనకు వ్యతిరేకంగా ఓటు వేస్తారని మోడీ భయపడిపోతున్నారట. అంతేకాదు... అద్వానీ ఎక్కడా బయటపడకపోయినా.. తన వర్గాన్ని తన మీద యుద్ధానికి సన్నద్ధం చేస్తున్నాడని మోడీ సందేహిస్తున్నాడట. ఇప్పటికే బీజేపీ తో పాటు జాతీయంగా అన్ని పార్టీల్లో అద్వానీ మీద సానుభూతి వ్యక్తం అవుతున్న విషయం మోడీకి బాగా అర్ధం అయ్యింది. అందుకే అద్వానీ అదును చూసి దెబ్బ కొడతారేమో అన్న భయంతో మోడీ వణికిపోతున్నారు. అందుకే అవిశ్వాస తీర్మానం గురించి మోడీ ఇంతగా అభద్రతకు లోను అవుతున్నారు. మొత్తానికి తాడిని తన్నేవాడు ఉంటే.. వాడిని తలను తన్నేవాడు ఉంటాడన్న సామెత ప్రకారం.. అందరూ మోడీ భయపెడుతుంటే.. మోడీ మాత్రం అద్వానికి భయపడుతున్నారు.