చంద్రబాబు, మోడీ భేటీ...

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. గత కొద్దికాలంగా మోడీ, ప్రధానికి అంతర్గత విబేధాలు ఉన్నాయని.. అందుకే చంద్రబాబుకి మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వడంలేదని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు స్వయంగా మోడీనే చంద్రబాబుతో భేటీ అవ్వాలనుకోవడం...దాదాపు ఏడాది తరువాత వీరిద్దరూ భేటీ అవ్వడంతో  ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ భేటీలో... పోలవరం ప్రాజెక్టుకు రూ.58వేల కోట్లతో సమర్పించిన పూర్తి స్థాయి అంచనాల్ని ఆమోదించడం, రాజధాని అమరావతి నిర్మాణం కోసం వచ్చే కేంద్ర బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించడం, రాష్ట్రంలో శాసనసభ నియోజకవర్గాల సంఖ్యను 175 నుంచి 225కి పెంచడంతోపాటు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన అన్ని హామీలను వెంటనే నెరవేర్చాల్సిందిగా చంద్రబాబు ప్రధానిని కోరనున్నట్లు తెలుస్తోంది.