చైనాపై మోడీ ఆగ్రహం....ఊరుకునేది లేదు..

 

ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి చైనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిహద్దు వివాదంలో గత కొద్ది కాలంగా భారత్త-చైనా మధ్య వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో మోడీ, చైనా ప్రారంభించిన 'వన్ బెల్ట్ వన్ రోడ్' ప్రాజెక్టుపై విమర్శలు గుప్పించారు. తమంతట తాముగా భారత్ ఏ దేశాన్నీ ఆక్రమించుకోవాలని, వారి పరిధిలోకి వెళ్లాలని చూడబోదని... భారత్, చైనా సరిహద్దుల్లో చైనా సైనికులే అత్యుత్సాహాన్ని చూపుతున్నారని, భారత భూభాగాన్ని తమ అధీనంలోకి తీసుకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇరుగు పొరుగు దేశాల అవసరాలను బట్టి తమ నిర్ణయాలు మారుతుంటాయని, వారి వనరులపై తామెన్నడూ కన్నేయబోమని, ఇదే సమయంలో భారత సార్వభౌమత్వానికి విఘాతం కలిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.