నోరు జారిన కేంద్రమంత్రి... 'నరేంద్ర మోదీకి సిగ్గుండాలి'

 

'నరేంద్ర మోదీకి సిగ్గుండాలి' ఇలా వ్యాఖ్యానించింది ఎవరబ్బా అనుకుంటున్నారా..? ఎవరో కాదు... సొంత బీజేపీ పార్టీ నేతే మోడీని ఇలా అన్నాడు. అయితే అదేదో సీరియస్ గా కాదులెండి.. నోరుజారి అన్నాడు. అసలు సంగతేంటంటే....బీజేపీ చేపట్టిన పరివర్తన యాత్రలో భాగంగా దక్షిణ కర్ణాటకలోని బంట్వాళలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో సదానందగౌడ, యడ్యూరప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభికులనుద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన సరిగా లేదని అన్నారు. అదే జోరులో ‘కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేందుకు నరేంద్రమోదీకి సిగ్గుండాలి’ అని వ్యాఖ్యానించారు. ఇక్కడ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అనబోయి నరేంద్రమోదీ అనేశారు. దీంతో సహచరుల సూచనతో నాలిక్కరుచుకుని పొరపాటును సరిచేసుకున్నారు.