ఆంద్రోడి దెబ్బకి పారిపోయిన మోడీ జీ...!

 

అందరూ ఊహించిందే జరిగింది. ఏపీ ప్రత్యేక హాదా అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకుండానే సభ నిరవధిక వాయిదా పడింది. గత మూడు వారాలుగా పార్లమెంట్ లో జరుగుతున్న డ్రామా అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని రాష్ట్రం వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు టీడీపీ ఎంపీలు, వైసీపీ ఎంపీలు కూడా పార్లమెంట్లో పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. ఆఖరికి కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఇక అవిశ్వాస తీర్మానం పెట్టారు కదా.. ఏదో అద్భుతం జరిగిపోతుంది... కేంద్రం దిగివస్తుంది అని అంతా అనుకున్నారు. కానీ... దాదాపు నెలరోజులైనా అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు రానివ్వలేదు మోడీ ప్రభుత్వం. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న విపక్షాలన్నీ ఏక తాటిపైకి వచ్చినా... ఆందోళన చేసినా ఉపయోగం లేకుండా పోయింది. దీనికి కూడా స్పీకర్ ఏవో కుంటి సాకులు చెప్పారనుకోండి.. వెల్ లోకి వచ్చి ఆందోళన చెబడితే చర్చకు కష్టం అని.. కౌంటింగ్ చేయలేమని నమ్మలేని సాకులు చెప్పారన్న విషయం స్పష్టంగా అర్దమవుతోంది. ఇక ఈరోజుతో పార్లమెంట్ సమావేశాలు కూడా అయిపోయాయి. అవిశ్వాస తీర్మానంపై చర్చే జరగలేదు.

 

దీంతో ఇప్పుడు మోడీపై ఒకటే సెటైర్లు వేసుకుంటున్నారు నెటిజన్లు. తెలుగోడి దెబ్బకి మోడీ భయపడ్డారని అంటున్నారు. అసలు మొదట్లో వైసిపీ అవిశ్వాసం నోటీసుకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తాను అని చెప్పింది... అప్పటికి, ఇంకా దేశంలోని ఏ పార్టీ కూడా వైసిపీ అవిశ్వాసానికి మద్దతు ఇవ్వలేదు... కాని, ఒక పక్క అవిస్వాసం అంటూ, మరో పక్క అదే నోటీసు పట్టుకుని విజయసాయి రెడ్డి ప్రధాని ఆఫీస్ కి వెళ్ళటంతో, వెంటనే చంద్రబాబు అలెర్ట్ అయ్యారు... వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారు అని తెలుసుకుని, వెంటనే టీడీపీ వారే అవిశ్వాసం పెట్టారు... అంతే, చంద్రబాబు అవిశ్వాసం పెట్టిన గంటలో, దేశంలోని అత్యధిక విపక్ష పార్టీలు, చంద్రబాబుకి మద్దతు ప్రకటించాయి. అప్పుడే మోడీ పతనానికి మొదటి అడుగు పడిందని అన్నారు. ఇక పార్లమెంట్లో అన్నాడీఎంకే తో డ్రామాలాడించి అవిశ్వాస తీర్మానం చర్చకు రానివ్వకుండా చేశారు. ఇంకా అశ్చర్యకరం ఏంటంటే... ఇంత గోల జరుగుతున్నప్పుడు అవిశ్వాస తీర్మానాన్ని చర్చించడం కుదరలేదు కానీ.. వాళ్లకు కావాల్సిన బిల్లులు ఆమోదించుకోవడం మాత్రం కుదిరింది. దీంతో మాకు సంపూర్ణ బలం ఉంది అంటూ పైకి మేకపోతు గాంభీర్యం చూపిస్తున్న మోడీ ఆంధ్రోడి దెబ్బకి పారిపోయారని సోషల్ మీడియాలో కామెంట్లు చేసుకుంటున్నారు. దేశంలోనే అత్యంత శక్తి వంతుడిగా పేరు పొందిన నేత.. కేవలం ఓ చిన్న అవిశ్వాస తీర్మానానికి భయపడ్డారని అనుకుంటున్నారు.