మొబైల్ నెంబర్ పుణ్యమా అని 7 లక్షలు స్వాహా.!!

 

మొబైల్ నెంబరే కదా ఏం అవుతుందిలే అనుకుంటే మనం పప్పులో కాలేసినట్లే. ఓ మొబైల్ నెంబర్ తెచ్చిన నష్టం విలువ అక్షరాలా రూ. 7 లక్షలు. హిమాయత్ నగర్ కి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రెండు నెలల క్రితం ఉన్నత ఉద్యోగం చేసేందుకు అమెరికా వెళ్లారు. ఆమె అమెరికా వెళ్లటంతో తన మొబైల్ నెంబర్ వినియోగించక పోవటంతో అది నిరుపయోగంగా మారింది.తాను నెంబర్ పనిచేయట్లేదు కదా అనుకోని తన బ్యాంకు ఖాతాలకు అదే నెంబర్ ఉంచటంతో ఊహించని పరిణామం ఎదురైంది. ఆ నెంబర్ ని సదరు నెట్ వర్క్ వేరొకరికి కేటాయించింది.ఆ వ్యక్తి ఆ నెంబర్ ఫోన్లో వేయగా ఆమె బ్యాంకు ఖాతా వివరాలు వచ్చాయి. వెంటనే ఆ వ్యక్తి యాప్స్ డౌన్లోడ్ చేసి పిన్ నెంబర్ వివరాలు పొందాడు. అనంతరం రూ.7 లక్షలు విత్ డ్రా చేసుకున్నాడు. ఆమె తండ్రి ఎటిఎం లో డబ్బులు డ్రా చేయగా లక్షల్లో డబ్బులు తగ్గటంతో నిర్ఘాంతపోయాడు. తన కూతురితో మాట్లాడగా ఆమె సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసారు.