పవన్ ని అందుకే తెరమీదకు తెస్తున్నారా...?

 

మేకపోతు గాంభీర్యం అంటే ఏంటో తెలుసు కదా..పైకి ఏదో ధైర్యంగా ఉన్నట్టు కనిపించినా.. లోపల మాత్రం భయంతో వణికిపోవడమే. ఇందుకు ఉదాహరణగా చెప్పడానికి ఈ సామెతను వాడుతుంటారు. ఇప్పుడు ఈ సామెత ఎందుకు వాడాల్సి వచ్చిందబ్బా అనుకుంటున్నారా. ప్రస్తుతం వైసీపీ పరిస్థితి అలానే ఉంది కాబట్టి. ఆ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకొని...పేలాల్సిందానికన్నా ఎక్కువ పేలుతూ... మాట్లాడాల్సిన దానికన్నా ఎక్కువ మాట్లాడుతూ నోరు కాస్త కంట్రోల్ లో కూడా పెట్టుకోవడం చేత కానీ నగరి ఎమ్మెల్యే రోజా మాటలు చూస్తుంటే పైన చెప్పిన సామెత గుర్తుకు రాకుండా ఉండదు. అసలు సబ్జెట్ ఏంటీ..సమస్యలు ఏంటీ.. ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు...ఇవేమీ అవసరం లేదు ఆమెకి. మాములుగానే ప్రతిపక్షం అన్నపేరు తప్ప.. ఆ ప్రతిపక్షం వల్ల ఇప్పటివరకూ ఒరిగింది ఏం లేదు. ఎంత సేపు అధికార పక్షంపై, చంద్రబాబుపై నోటికొచ్చినట్టు మాట్లాడమంటే మాత్రం ఫస్ట్ ఉంటారు. ఆ పైత్యాన్ని మరోసారి నిరూపించారు రోజా గారు.

 

పోలవరం ప్రాజెక్టు విషయంలో వైసీపీ, అధికార పార్టీపై ఆరోపణలు చేస్తుంది కదా. ఈ క్రమంలోనే...వైసీపీ బ్యాచ్ అక్కడికి వెళ్లింది. రోజా గారు కూడా అక్కడికి వెళ్లారు. అయితే అక్కడ ఏం జరుగుతుందో…ఏంటో అర్ధం కాలేదు అనుకుంట…వెంటనే…వెన్నుపోటూ అంటూ షరా మామూలుగా కధ మొదలు పెట్టేశారు. అక్కడ ఏం జరుగుతుంతో చెప్పకుండా...జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అక్కడి వెళ్లడంపై.. దాని గురించి కామెంట్లు విసిరారు. పవన్‌ది “జనసేన” కాదు-“భజన సేన” అని…పవన్ కళ్యాణ్ మాటలకు, చేతలకూ పొంతన ఉండదనీ, చంద్రబాబు ఎప్పుడు అవినీతి లో ఇరుక్కున్నా, తెరమీదకు పవన్‌ కళ్యాణ్ ను తెచ్చి విషయాన్ని పక్కదోవ పట్టిస్తారని రోజా…దండకం మొదలు పెట్టారు…”అనుభవం లేని వ్యక్తి ముఖ్యమంత్రి అవకూడదని పవన్‌ కళ్యాణ్ అంటున్నారు. మరి పిల్లనిచ్చిన మామపై చెప్పులు విసిరి, వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి కావొచ్చా? అని పాడిన పాటే పాడారు.

 

అసలు ఆమె వెళ్లింది ఎక్కడికి.. అక్కడ పనులు ఎంతవరకు వచ్చాయి.. ఇంకా ఎన్ని పనులు జరగాల్సి ఉంది... ఇలాంటి విషయాలు మర్చిపోయారు. ఎప్పటిలాగే పవన్ పై, చంద్రబాబుపై తిట్ల పురాణం ఎత్తుకున్నారు. దీంతో ఒక పక్క మీ నాయకుడి బాగోతం రోజుకొక్కటి బయటపడుతూ ఉంటే…చేస్తున్న యాత్రలు జనం లేక చప్పగా సాగుతుంటే…ఏం చెయ్యాలో అర్ధం కాక…ఇలా చవకబారు విమర్శలు చెయ్యడానికా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకుంది అని అభిప్రాయపడుతున్నారు. కాస్త వెళ్ళి ముందు మీ నియోజకవర్గంలో పరిస్థితులను అడిగి తెలుసుకోండి…ఎన్నికైన మూడున్నర ఏళ్లలో ఇప్పటివరకు పైసా పనికూడా చేయించని మీరు…చివర్లో మీ చేతగాని తనాన్ని కూడా ప్రభుత్వంపై నెట్టెయ్యాలని చూస్తున్నారా అని పలువురు  అనుకుంటున్నారు. మరి రోజా గారు ఇప్పటికైనా ఏం మాట్లాడుతున్నామో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మాట్లాడితే మంచిది...