మంత్రి, ఎమ్మెల్యే వాగ్వాదం.. 

వాళ్ళు ఇద్దరు ఒకే పార్టీ నాయకులు. ఒకరు మంత్రి అయితే, మరొకరు ఎమ్మెల్యే. ఏ పార్టీ వారైనా ప్రతిపక్షం వారిని విమర్శించుకుంటారు. కానీ మాత్రం సొంత పార్టీ వారి పైనే విమర్శలు కురిపించుకున్నారు. వారు ఎవరో కాదు మీరే చూడండి.   

డీసీసీబీ మల్టీ సర్వీసెస్ సమావేశంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. డోర్నకల్ నియోజకవర్గంపై వివక్ష చూపుతున్నారని రెడ్యానాయక్ విమర్శించారు. నియోజకవర్గానికి నిధులు విడుదల చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఎర్రబెల్లి కల్పించుకుని మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారని రెడ్యానాయక్‌ను ప్రశ్నించారు. తాను మంత్రి పదవి ఎవరి దగ్గర గుంజుకోలేదని, దివంగత మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తనకు మంత్రి పదవి ఇచ్చారని రెడ్యానాయక్‌ తెలిపారు. ‘నీకు త్వరలోనే మంత్రి పదవి వస్తుంది’’ అని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. ‘‘మీరుండగా నాకు ఎలా వస్తుంది’’ అని రెడ్యానాయక్ ప్రశ్నించారు. రెడ్యానాయక్, ఎర్రబెల్లి సంభాషణపై రాజీకయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.